T20 World Cup 2026: టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ కు ( T20 World Cup 2026 ) సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై సొంత దేశ క్రికెటర్లు తిరుగుబాటు చేసినట్టు తెలుస్తోంది. టి20 ప్రపంచ కప్ తాము ఆడబోమoటూ తాజాగా సంచలన ప్రకటన చేశారట. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేస్తేనే టీ20 ప్రపంచ కప్ 2026 ఆడదామని బంగ్లాదేశ్ క్రికెటర్లు అందరు ఒకే తాటిపైకి వచ్చారట. అతను రాజీనామా చేయడమే కాకుండా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారట. బంగ్లాదేశ్ మాజీ స్టార్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ ను ఇండియన్ ఏజెంట్ అంటూ బంగ్లాదేశ్ డైరెక్టర్ మజ్ముల్ ఇస్లాం కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలోనే తమీమ్ ఇక్బాల్ కు అనుకూలంగా బంగ్లాదేశ్ క్రికెటర్లు ( Bangladesh) ఈ నిరసన తెలుపుతున్నారు.
బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ( Tamim Iqbal ) ఇండియన్ ఏజెంట్ అంటూ ఇటీవల బంగ్లాదేశ్ డైరెక్టర్ మజ్ముల్ ఇస్లాం కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళండి.. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి.. దానివల్ల ఐసీసీ నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సూచనలు చేశారు మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్. అయితే ఈ కామెంట్ చేసిన వెంటనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మజ్ముల్ ఇస్లాం ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. తమిమ్ ఇక్బాల్ ఇండియన్ ఏజెంట్ అంటూ మండిపడ్డారు. ఇండియాకు అమ్ముడుపోయి బంగ్లాదేశ్ కు సూచనలు చేస్తున్నాడని నిప్పులు జరిగారు BCB డైరెక్టర్ మజ్ముల్ ఇస్లాం ( BCB Director Mazmul Islam).
అయితే బంగ్లాదేశ్ డైరెక్టర్ మజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు అందరూ ఏకతాటి పైకి వచ్చారు. మాజీ క్రికెటర్ తమిమ్ ఇక్బాల్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తన పదవికి మజ్ముల్ ఇస్లాం రాజీనామా చేయాలని ఫైర్ అవుతున్నారు. ఒకవేళ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ( Bangladesh Cricket Board )పదవికి మజ్ముల్ ఇస్లాం రాజీనామా చేయకపోతే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడబోమని బోర్డుపై తిరుగుబాటు చేశారు బంగ్లాదేశ్ క్రికెటర్లు. దీంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. మరి ఈ వివాదంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ( BangladeshCricket Board) ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాగా ఇండియలో బంగ్లాదేశ్ పర్యటించడంపై ఇంకా క్లారిటీ రాలేదు.
🚨 BIG FIGHT IN BANGLADESH CRICKET 🚨
"Bangladesh cricketers are threatening a full boycott of T20 World Cup 2026, until BCB Director Mazmul Islam resigns for allegedly calling legend Tamim Iqbal an "India Agent."
– What's your take 🤔 pic.twitter.com/ogHR6pHKxD
— Richard Kettleborough (@RichKettle07) January 15, 2026