E-Paper
Advertisement

Kohli-Anushka: 5.1 ఎకరాల భూమిని కొన్న కోహ్లీ ఫ్యామిలీ..ఎన్ని కొట్ల విలువ అంటే

Kohli-Anushka:  5.1 ఎకరాల భూమిని కొన్న కోహ్లీ ఫ్యామిలీ..ఎన్ని కొట్ల విలువ అంటే
Advertisement

Kohli-Anushka:  క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరికీ సపరేట్ గా కోట్లాది సంఖ్యలో అభిమానులు అభిమాన సంఘాలు ఉన్న విషయం తెలిసిందే. అనుష్క శర్మ తన సినిమాలతో బాలీవుడ్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విరాట్ కోహ్లీ తనదైన ఆట తీరుతో టీమిండియాకు ఎన్నో ఘనవిజయాలను అందించాడు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ ప్రస్తుతం లండన్ లో సెటిల్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాగా వీరిద్దరికి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లండన్ లో ఉంటున్న ఈ జంట ఆలీబాగ్ లో 5.1 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈ స్థలంలో వీరు ఇల్లు కట్టుకుంటారా లేదా అనే సందేహంలో అభిమానులు ఉన్నారు.

Also Read: Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవ‌మానం..యూపీ కొంప‌ముంచిన‌ “రిటైర్ట్ ఔట్”

ఐదెకరాల స్థలం కొనుగోలు చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట…!

Advertisement

విరాట్, అనుష్క జంట ఆలీబాగ్ లో 5.1 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఈ భూమి కోసం ఏకంగా 38 కోట్లు కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ స్థలంలో వీరు ఇల్లు కట్టుకొని ఆలీబాగ్ లోనే ఉండాలని అనుకుంటున్నట్లుగా కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. లండన్ ను విడిచిపెట్టి ఇక్కడికే వచ్చి సెటిల్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం తెలిసిన అనంతరం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

లండన్ ను వదిలేస్తున్న విరాట్ అనుష్క…!

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కుటుంబ సభ్యులతో కలిసి లండన్ లో సెటిల్ అయ్యారు. అయితే మ్యాచ్లు ఉన్న సమయంలోనే విరాట్ కోహ్లీ ఇండియాకు తిరిగి వచ్చేవాడు. మ్యాచ్ పూర్తయిన అనంతరం లండన్ కు తిరిగి వెళ్లేవారు. అయితే ఈ జంట లండన్ లో ఉండడానికి గల కారణం అక్కడ చాలా ప్రశాంతంగా ఉండవచ్చని ఎలాంటి గందరగోళం ఉండదని అనుకున్నారు. అభిమానుల హడావిడి లేకుండా బయటికి వెళితే లండన్ లో వారిని ఎవరు పెద్దగా గుర్తుపట్టరని ఈ నిర్ణయం తీసుకున్నారు. లండన్ లో ఏకాంతంగా బయట ప్రశాంతంగా తిరగడం కోసమే అనుష్క విరాట్ తమ పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఆలీబాగ్ లో స్థలం కొనుగోలు చేయడంతో వీరు లండన్ ను వీడుతున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మరి ఈ జంట నిజంగానే లండన్ ను వదిలేసి ఇండియాకు వస్తే చాలా బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పైన ఏదో ఒక క్లారిటీ వస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.

Advertisement

Also Read: T20 World Cup 2026: ఇండియ‌న్ ఏజెంట్ కామెంట్స్‌..BCBపై బంగ్లా క్రికెట‌ర్ల తిరుగుబాటు, వాడు రాజీనామా చేయాలంటూ

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×