E-Paper
Advertisement

Shreyas Iyer: టీ20ల‌కు గిల్ ప‌నికిరాడు..తిల‌క్ వ‌ర్మ స్థానంలో శ్రేయాస్ అయ్య‌ర్ ఎంట్రీ

Shreyas Iyer: టీ20ల‌కు గిల్ ప‌నికిరాడు..తిల‌క్ వ‌ర్మ స్థానంలో శ్రేయాస్ అయ్య‌ర్ ఎంట్రీ
Advertisement

Shreyas Iyer: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా టీమిండియాకు దూరమైన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా జట్టుతో వచ్చే వారంలో ఐదు t20 ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో మొదటి మూడు టి20 మ్యాచ్ లకు గాయం కారణంగా తిలక్ వర్మ దూరం కాబోతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో తిలక్ వర్మ స్థానంలో ఇటీవల గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ కు ఛాన్స్ ఇస్తూ సంచలన ప్రకటన చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో టి20లకు అందుబాటులోకి రాబోతున్నాడు శ్రేయాస్ అయ్యర్.

Also Read: Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవ‌మానం..యూపీ కొంప‌ముంచిన‌ “రిటైర్ట్ ఔట్”

తిలక్ వర్మ కు గాయం.. రంగంలోకి శ్రేయాస్ అయ్యర్

Advertisement

టీమ్ ఇడియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ప్రస్తుతం 3 వన్డేల సిరీస్ కొనసాగుతోంది. జనవరి 21వ తేదీ నుంచి న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య 5 t20 ల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ నేపథ్యంలో సెలెక్ట్ అయిన తిలక్ వర్మకు గాయమైంది. వృషణాలకు సంబంధించి తిలక్ వర్మకు ఆపరేషన్ జరిగింది. విజయ్ హజారే టోర్నమెంట్ ఆడుతున్న నేపథ్యంలో తీవ్రమైన కడుపునొప్పి బారిన పడ్డ తిలక్ వర్మ.. ఆసుపత్రిలో చేరగా ఆపరేషన్ చేశారు వైద్యులు. రాజ్కోట్ లో ఈ ఆపరేషన్ జరిగినట్లు సమాచారం.

హైదరాబాదులోనే ప్రస్తుతం తిలక్ వర్మ ఉన్నాడు. అయితే అతనికి ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో తిలక్ వర్మాను 3 t20 లకు దూరం చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఆపరేషన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ మూడు టి20 లకు గాను తాజాగా తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను తీసుకుంటున్నట్లు ప్రకటన చేసింది బీసీసీఐ. ఐపీఎల్ 2025 టోర్నమెంటులో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అందుకే తిలక్ వర్మ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

గిల్ కు ఘోర అవమానం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం ప్రకటించిన జట్టులో గిల్ ను తీసుకోలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే గిల్ బాగా ఆడుతున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండు వన్డేల్లో కూడా అర్థ సెంచరీ నమోదు చేశాడు. దీంతో తిలక్ వర్మ స్థానంలో గిల్ ను సెలెక్ట్ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే బిసిసిఐ మాత్రం అలా చేయకుండా శ్రేయస్ అయ్యర్ను సెలెక్ట్ చేసి గిల్ ను అవమానించింది. గిల్ వన్డేలకు మాత్రమే పరిమితం అవుతాడని మరోసారి పరోక్షంగా చెప్పింది. అటు వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్థానంలో ర‌వి బిష్టోయ్ ని న్యూజిలాండ్ తో జ‌రిగే 5 టీ20ల‌కు సెల‌క్ట్ చేశారు.

Also Read: T20 World Cup 2026: ఇండియ‌న్ ఏజెంట్ కామెంట్స్‌..BCBపై బంగ్లా క్రికెట‌ర్ల తిరుగుబాటు, వాడు రాజీనామా చేయాలంటూ

 

 

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×