E-Paper
Advertisement

Gautam Gambhir: గంభీర్ కు ఘోర అవ‌మానం.. డౌన్, డౌన్ అంటూ నినాదాలు..అభిమాని అరెస్ట్‌

Gautam Gambhir: గంభీర్ కు ఘోర అవ‌మానం.. డౌన్, డౌన్ అంటూ నినాదాలు..అభిమాని అరెస్ట్‌
Advertisement

Gautam Gambhir:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa, 2nd Test) మధ్య టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ ను సఫారీలు గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ( Gautam Gambhir) తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతని వల్లే స్వదేశంలో టెస్ట్ సిరీస్ లు టీమిండియా కోల్పోతోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక ఆట ఆడుకుంటున్నారు.

Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!

స్టేడియంలోనే గౌతమ్ గంభీర్ కు ఘోర అవమానం

Advertisement

దక్షిణాఫ్రికా తో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఘోర అవమానం ఎదురయింది. గౌహతి స్టేడియంలోనే గౌతమ్ గంభీర్ ను అవమానిస్తూ ప్రేక్షకులు రెచ్చిపోయారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత గ్రౌండ్ లోకి గౌతమ్ గంభీర్ వచ్చాడు. ఈ సమయంలో అతన్ని చూసిన టీమిండి అభిమానులు, గౌతమ్ గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సిగ్గుపడండి అని అర్థం వచ్చేలా గౌతమ్ గంభీర్ ను హేళన చేశారు టీమిండియా ఫ్యాన్స్. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) రియాక్ట్ అయ్యాడు. కాస్త సైలెంట్ గా ఉండాలంటూ అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు మహమ్మద్ సిరాజ్. దండం పెడతారా ? బాబు … గౌతమ్ గంభీర్ ను ఏమీ అనకండి అంటూ సైగలు చేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం: గంభీర్

దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా టెస్ట్ సిరీస్ ఓటమి పాలైన నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మొదటిసారి స్పందించారు. తన భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. తాను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా ? లేదా ? అనేది బిసిసిఐ బోర్డు డిసైడ్ చేస్తుందన్నారు. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం తనకు కాదని వివరణ ఇచ్చారు. చాంపియస్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ కూడా తన ఆధ్వర్యంలోనే టీమిండియా గెలుచుకుందున్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు గౌతమ్ గంభీర్. అయితే గౌతమ్ గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు చేతకాని దద్దమ్మవు అంటూ మండిపడుతున్నారు. కాగా ద‌క్షిణాఫ్రికా చేతిలో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయింది టీమిండియా. రెండు టెస్టుల్లోనూ దారుణంగా ఓడింది టీమిండియా.

Advertisement

 

Also Read: T20 World Cup 2026 Schedule: టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్…4 గ్రూప్ లు, 20 జ‌ట్లు..పాకిస్తాన్‌, భార‌త్ మ్యాచ్ ఎప్పుడంటే

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×