Shivani Nagaram (Image Credit: Instagram)
శివాని నాగారం.. తెలుగమ్మాయి అయినా ఒకప్పుడు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ ఇటీవల 90స్ బయోపిక్ ఫేమ్ మౌళి హీరోగా లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

Shivani Nagaram (Image Credit: Instagram)
ముఖ్యంగా ఈ సినిమా అందించిన విజయంతో ఏకంగా ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంది శివాని నాగారం.

Shivani Nagaram (Image Credit: Instagram)
ఇదిలా ఉండగా ఇప్పుడు సుహాస్ హే భగవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుహాస్ హీరోగా, శివాని నాగారం హీరోయిన్గా ఫిబ్రవరి 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

Shivani Nagaram (Image Credit: Instagram)
ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా అనడంతో అంచనాలు పెరిగిపోయాయి.

Shivani Nagaram (Image Credit: Instagram)
మరొకవైపు శివాని సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా మహాశివరాత్రి సందర్భంగా బ్లాక్ కలర్ చీర కట్టుకున్న ఈమె అందాలు ఆరబోస్తూ తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Shivani Nagaram (Image Credit: Instagram)
బ్లాక్ కలర్ శారీలో తెలుగమ్మాయి శివాని చాలా అందంగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శివాని షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.