E-Paper
Advertisement

Tilak Varma: టీ20ల‌ను టెస్టుల్లాగా ఆడుతున్నాడు..తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌పై ట్రోలింగ్‌

Tilak Varma: టీ20ల‌ను టెస్టుల్లాగా ఆడుతున్నాడు..తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌పై ట్రోలింగ్‌
Advertisement

Tilak Varma: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై ( Tilak Varma) దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. తిలక్ వర్మ టి20 వరల్డ్ కప్ లో స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అతని స్థానంలో శివమ్ దూబేను ప్రమోట్ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇలా స్లోగా బ్యాటింగ్ చేస్తే టీమిండియా వరల్డ్ కప్ గెలవడం కష్టమే అని పోస్టులు పెడుతున్నారు. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాడి స్థానంలో తిలక్ వర్మకు అవకాశం వస్తోన్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి నేపథ్యంలో తిలక్ వర్మ అద్భుతంగా ఆడకుండా.. టి20 లను టెస్టుల్లాగా ఆడుతున్నాడని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై వెంటనే టీమిండియా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

టీ20ల‌ను టెస్టుల్లాగా ఆడుతున్నాడు..తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌పై ట్రోలింగ్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament)  నేపథ్యంలో తిలక్ వర్మ ( Tilak varma) బ్యాటింగ్ పైన సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడాడు. ఈ సందర్భంగా అతడు ఒక్క అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేదు. టీమిండియా కు అవసరమైన పరుగులు ఎక్కడ సాధించలేకపోయాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) జట్టుతో 16 బంతులలో 25 పరుగులు మాత్రమే సాధించాడు తిలక్ వర్మ. ఇక నమీబియా పైన కూడా అవకాశం వచ్చింది. అక్కడ 21 బంతులు ఎదుర్కొని 25 పరుగులు మాత్రమే చేశాడు.

ఇక పాకిస్తాన్ పైన 24 బంతులు మింగిన తిలక్ వర్మ ( Tilak varma), కేవలం 25 పరుగులు చేశాడు. ఇక పసికూన నెద‌ర్లాండ్స్ పైన విజృంభిస్తాడనుకుంటే.. అక్కడ కూడా 27 బంతుల తిన్న తిలక్ వర్మ, 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తిలక్ వర్మ టి20 లకు పనికిరాడ‌ని దారుణంగా ఆడుకుంటున్నారు క్రికెట్ అభిమానులు. స్ట్రైక్ రేట్ 120 తో టి20 లు ఆడాలంటే కష్టమేనని.. తిలక్ వర్మను పట్టుకొని సూపర్ 8 ఆడడం తెలివి తక్కువ పని అంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. వెంటనే తిలక్ వర్మను తొలగించి, సంజు శాంసన్ ను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సూపర్ 8 లోకి అడుగుపెట్టిన టీమిండియా ఫిబ్రవరి 22వ ( FEB) తేదీ నుంచి మ్యాచ్ లు ఆడనుంది. మొదట దక్షిణ ఆఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. ఆ తర్వాత జింబాబ్వే లాంటి చిన్న జ‌ట్టుతో కూడా ఆడనుంది. చివరగా వెస్టిండీస్ తో ( West Indies) మార్చి 1వ తేదీన సూపర్ 8 మ్యాచ్ ఆడనుంది సూర్య కుమార్ యాదవ్ సేన.

Advertisement

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×