Anushka Shetty: తెలుగు సినీ నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఈ చిన్నది అనేక సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఒకానొక సమయంలో అనుష్క శెట్టి తెలుగు సినీ పరిశ్రమను తన సినిమాలతో ఓ ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. తన సినిమాలకు, అందానికి కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అనుష్కతో సినిమాలు చేయడానికి హీరోలు, దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపించేవారు. తన డేట్స్ కోసం క్యూలో నిలబడేవారు.
Also Read: WTC- Handling The Ball: WTC ఫైనల్‌లో అనూహ్య ఘటన..ఏంటి ఈ ‘హ్యాండిల్డ్ ది బాల్’ వివాదం ?
ఇక అనుష్క సినిమాల లో నటిస్తున్న సమయంలో నిర్మాతల హీరోయిన్ గా పేరు పొందింది. దానికి గల కారణం ఆమె నిర్మాతలతో ఎఫైర్ పెట్టుకుందని అనేక రకాల వార్తలు వచ్చాయి. అంతే కాకుండా స్టార్ హీరోలతో కూడా అనుష్క సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించిందని వార్తలు వచ్చాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ అనుష్క శెట్టి ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. వివాహం చేసుకోకుండా సినిమాలలో నటిస్తూ సంతోషంగా తన లైఫ్ లీడ్ చేస్తోంది. కాగా గత కొద్దిరోజుల నుంచి అనుష్క శెట్టి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుందని అనేక రకాల వార్తల వైరల్ అవుతున్నాయి. తాజాగా అనుష్క టీమిండియా ( Team India) ప్రముఖ క్రికెటర్ తో సీక్రెట్ గా రిలేషన్ పెట్టుకుందట.
ఉత్తరాదికి చెందిన ఆటగాడితో అనుష్క ప్రేమ లో ఉందని తొందరలోనే ఆ క్రికెటర్ తో ఏడడుగులు వేయబోతుందని వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఆ క్రికెటర్ ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం బయటికి రాలేవు. కానీ అనుష్క ఈ సారి నిజంగానే వివాహం చేసుకోబోతుందని తన సన్నిహితులు వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే కానీ అసలు విషయం బయటికి రాదు. ఏది ఏమైనాప్పటికీ అనుష్క శెట్టి ఈ విషయం పైన రియాక్ట్ అవుతూనే అసలు విషయం తెలుస్తుంది.
Also Read: Shubman Gill: సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న శుభ్‌మన్ గిల్… ఈ ఓవర్ యాక్షనే తగ్గించుకో అంటూ ట్రోలింగ్
కొంత మంది ఈ విషయం తెలిసి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అనుష్క ( Anushka Shetty) వివాహం చేసుకుంటే చూడాలని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న వారి కళ నెరవేరుతుంది. అనుష్క వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలని కొంత మంది అనుకుంటే మరి కొంత మంది ఇది కేవలం రూమర్ మాత్రమేనని కొట్టి పారేస్తున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కాగా, అనుష్క ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. మలయాళం, తెలుగులో వరుస సినిమా షూటింగ్లలో పాల్గొంటుంది. ఇది ఇలా ఉండగా ఘాటీ మూవీ తో త్వరలోనే అనుష్క రానుంది.