WTC- Handling The Ball: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) పూర్తికాగానే… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ ( World Test Championship 2025 final match ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. రెండు జట్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నాయి. ఒక సెషన్ లో ఆస్ట్రేలియా పై చేయి సాధిస్తే మరొక సెషన్ లో దక్షిణాఫ్రికా పై చేయి సాధిస్తుంది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గెలుపు రెండు జట్ల మధ్య దోబూచులాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ అరుదైన సంఘటన ఇప్పుడు… హాట్ టాపిక్ అయింది.
హ్యాండిల్డ్ ద బాల్ వివాదం
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ ( World Test Championship 2025 final match ) మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 46 ఓవర్ ఆస్ట్రేలియా బౌలర్ వెబ్ స్టార్ వేయడం జరిగింది. అయితే.. బ్యాటింగ్ చేస్తున్న బెడ్డింగ్ హామ్ బ్యాటును ఆ బంతి తాకి ప్యాడ్ లో పడిపోయింది. దీంతో బ్యాటర్… దాన్ని తన చేతితో కింద పడేశాడు.
ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ప్లేయర్లు హ్యాండిల్ ద బాల్ గురించి అప్పీల్ చేయడం జరిగింది. అయితే అప్పటికే అది డెడ్ బాల్ అయింది అంటూ అంపైర్లు… తేల్చి పారేశారు. ఆస్ట్రేలియా అప్పీల్ తప్పిదమని నాట్ అవుట్ గా కూడా ప్రకటించేశారు. అటు రీప్లేలో బాల్ కదులుతూ కనిపించడంతో… ఆస్ట్రేలియా అభిమానులు మాత్రం మండిపడుతున్నారు. దీంతో ఈ వివాదం రచ్చ రచ్చ చేస్తుంది.
టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్… అదరగొడుతున్న ఇరు జట్లు
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ( WTC 2025) ఆస్ట్రేలియా (Australia) అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు రెండు కూడా అదరగొడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 212 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 138 పరుగులకే ఆల్ అవుట్ కావడం జరిగింది. దీంతో ఆస్ట్రేలియా కు లీడ్ భారీగానే లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కాస్త తడబడుతోంది. రెండో రోజు ముగిసే సమయానికి… 8 వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా 144 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్లో 218 పరుగుల లీడ్ సంపాదించింది ఆస్ట్రేలియా. ఇవాళ మూడవ రోజులో ఆ చివరి రెండు వికెట్లు తీసేసి.. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేయబోతోంది.
Also Read: RCB For Sale: అమ్మేయడం ఫైనల్… ఆ లేడీ చేతికి RCB టీం.. ట్రబుల్ షూటర్ ప్లాన్ అదుర్స్ !
A controversy involving the Aussies at Lord's, you say? 😬
The ball didn't seem fully dead before the South African batter handled it… should this have been given out in the #WTCFinal? >> https://t.co/FUwQtegDjU pic.twitter.com/xBICUmvqqs
— Fox Cricket (@FoxCricket) June 12, 2025