Shubman Gill: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పూర్తికాగానే.. ఇప్పుడు అందరి దృష్టి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ పైన పడింది. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుభ్‌మన్ గిల్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు. శుభ్‌మన్ గిల్ సారధ్యంలోనే ఇంగ్లాండ్ వెళ్ళింది టీం ఇండియా. అయితే ఈ నేపథ్యంలోనే… టీమిండియా టెస్ట్ కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్ బ్యాట్ పైన ఉన్న పేరును… చూపిస్తూ సెటైర్లు పేల్చుతున్నారు క్రికెట్ అభిమానులు.
Also Read: MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం
క్రికెట్ బ్యాట్ పై ప్రిన్స్ అంటూ స్టిక్కర్లు
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య అతి త్వరలోనే ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్ నేపథ్యంలో… శుభ్‌మన్ గిల్ సంసిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్గా బాధ్యతలు తీసుకొని కొత్త జెర్సీ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చాడు. అయితే ఈ నేపథ్యంలోనే తాను వాడే MRF బ్యాట్… పట్టుకొని మరీ ఫోటోలు దిగాడు గిల్. అయితే ఇక్కడే అడ్డంగా దొరికిపోయాడు శుభ్‌మన్ గిల్. తాను వాడే ఎంఆర్ఎఫ్… బ్యాట్ పైన ప్రిన్స్ అంటూ స్టిక్కర్లు వేయించుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఇదే తరహాలో శుభ్‌మన్ గిల్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
శుభ్‌మన్ గిల్ ను ఆడుకుంటున్న క్రికెట్ అభిమానులు
సచిన్ టెండూల్కర్ ను సాధారణంగా క్రికెట్ గాడ్ అని పిలుస్తారు అన్న సంగతి తెలిసిందే. అది అభిమానులు పెట్టుకున్న నిక్ నేమ్. అటు మహేంద్ర సింగ్ ధోని కి మిస్టర్ కూల్ అని, విరాట్ కోహ్లీ కింగ్ అంటూ సాధారణంగా క్రికెట్ అభిమానులు పేరు పెట్టేశారు. రోహిత్ శర్మాను ముందుగా హిట్ మాన్ అంటారు. ఈ నేపథ్యంలోనే శుభ్‌మన్ గిల్ ను కూడా ప్రిన్స్ అంటూ ముద్దుగా పిలుస్తారు. పిలవడం వరకు ఓకే కానీ శుభ్‌మన్ గిల్ కాస్త ఓవరాక్షన్ చేశాడు. ఆ ప్రిన్స్ అనే పేరు నూతన MRF బ్యాటు పైన స్టిక్కర్ లాగా అంటించాడు. ఈ ఫోటోలు బయటకు రావడంతో.. శుభ్‌మన్ గిల్ ను దారుణంగా ఆడుకుంటున్నారు క్రికెట్ అభిమానులు.
నీకు కొంచెం కూడా సిగ్గు లేదంటూ ఫైర్ అవుతున్నారు. కాస్త ఓవర్ గా అనిపించడం లేదా…? నీ టెస్ట్ యావరేజ్ 35 కంటే చాలా తక్కువ ఉంది.. నీ కెప్టెన్సీలో ఒక్క టెస్ట్ కూడా గెలవలేదు.. అప్పుడే ప్రిన్స్ అయిపోయావా? అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇది ఇలా ఉండగా… ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఐదు టెస్టులు… మొత్తం పూర్తయ్యేసరికి… ఆగస్టు మొదటి వారం వస్తుంది. అప్పటివరకు గిల్ కెప్టెన్సీలో టీమిండియా.. టెస్ట్ మ్యాచ్ లు ఆడబోతోంది.
Also Read: Tino Best: 650 మంది మహిళలతో శృ***గారం.. ఆ వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ అరాచకాలు