అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ లో 241 మంది చనిపోయారు. సర్దార్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్టుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి లేచిన కాసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. మరోవైపు ఈ ఘటనకు గల కారణాలు అన్వేషించే పనిలో పడ్డారు దర్యాప్తు అధికారులు. చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. ఇప్పటి బ్లాక్ బాక్స్ లభించగా దానిని కూడా విశ్లేషిస్తున్నారు.
ఏటీసీకి పైలెట్ సుమిత మేడే కాల్
విమనాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కిందికి పడిపోవడం ప్రారంభమైంది. ఈ సమయంలోనే పైలెట్ సుమిత్ సభర్వాల్ అహ్మదాబాద్ ఏటీసీకి మేడే కాల్ చేశాడు. ఎమర్జెన్సీ సమయంలో మేడే కాల్ చేస్తారు. కేవలం 5 సెకెన్ల మేడే కాల్ తర్వాత విమానం సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ మీద కుప్పకూలింది. ఈ 5 సెకెన్లలో పైలట్ ఏం చెప్పాడు అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
ఐదు సెకెన్లు.. మూడు మాటలు
మేడే కాల్ లో పైలెట్ సుమిత్ జస్ట్ మూడు మాటలు చెప్పాడు. “మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. పైకి లిఫ్ట్ కావడం లేదు” అన్నాడు. మరుక్షణం లోనే విమానం కూలిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న 241 మంది చనిపోగా, మెడికల్ కాలేజీలో ఉన్న మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. పైలెట్ మేడే కాల్ ప్రకారం చూస్తే, విమానం కూలడానికి ముందు అన్ని వ్యవస్థలు పని చేయడం మానేసినట్లు అర్థం అవుతోంది.
అంతా ఒక నిమిషంలోనే!
అటు ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా కీలక విషయాలు వెల్లడించారు. విమానం కేవలం 650 అడుగుల ఎత్తుకు ఎగిరి కింద పడిపోయినట్లు వివరించారు. “ఈ విమానం మధ్యాహ్నం 1:39 గంటలకు బయలుదేరింది. కొన్ని సెకన్లలో దాదాపు 650 అడుగుల ఎత్తుకు చేరుకున్నది. వెంటనే అది కిందికి పడిపోవడం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1:39 గంటలకు, పైలట్ అహ్మదాబాద్ ఏటీసీకి ఇది మే డే అని, అంటే ఫూ ఎమర్జెన్సీ అని తెలియజేశాడు. వెంటనే, ఏటీసీ సిబ్బంది ఎయిర్ ఇండియా విమానాన్ని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, దాని నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సరిగ్గా 1 నిమిషం తర్వాత, విమానాశ్రయం నుంచి 2 కి.మీ దూరంలో ఉన్న మేధాని నగర్ లో కూలిపోయింది” అని సిన్హా వివరించారు.
అచ్చం సినిమాలో జరిగినట్లుగానే..
ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ‘ప్లేన్’ అనే మూవీ రిలీజ్ అయ్యింది. అందులో పిడుగు పడి విమానంలో పవర్ మొత్తం పోతుంది. ఇంజిన్స్ కూడా రన్ కావు. కేవలం బ్యాటరీ పవర్‌తో కంట్రోల్స్ పని చేస్తాయి. కమ్యునికేషన్ దెబ్బ తినడం వల్ల మేడే.. మేడే.. విమానం మీద కంట్రోల్ కోల్పోయం అని చెప్పినా ఏటీసీకి చేరదు. చివరికి అతడు ఐ లాండ్‌లో విమానాన్ని ల్యాండ్ చేస్తాడు. అయితే, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో పైలట్ చివరి మాటలు విన్నా.. ఇదే సినిమా గుర్తుకు వస్తుంది. మేడే.. మేడే.. పవర్ లేదు, విమానం పైకి లిఫ్ట్ కావడం లేదు.. అని చెప్పిన కాసేపటికే క్రాష్ అయ్యింది.
Read Also: విమానంలో ఇంధన ట్యాంక్ ఎక్కడ ఉంటుంది? ఎమర్జెన్సీ టైమ్ లో ఏం చేస్తారు?