E-Paper
Advertisement

Arafat Minhas father: అరాఫత్ మిన్హాస్ క్యాచ్ ఔట్…క‌న్నీళ్లు పెట్టుకున్న కెమెరామెన్

Arafat Minhas father: అరాఫత్ మిన్హాస్ క్యాచ్ ఔట్…క‌న్నీళ్లు పెట్టుకున్న కెమెరామెన్
Advertisement

Arafat Minhas father:  పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. మే 30వ తేదీన ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభమైంది. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రాణించి, 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది పాకిస్తాన్. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా నిన్న మూడవ వన్డే జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెటర్ వికెట్ పడిపోగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను కన్నీళ్లు పెట్టుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. పాకిస్తాన్ క్రికెటర్ తండ్రే.. నిన్న స్టేడియంలో వీడియో గ్రాఫర్ గా ఉన్నాడు. అందుకే ఎమోషనల్ అయ్యాడు.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

అరాఫత్ మిన్హాస్ క్యాచ్ ఔట్…క‌న్నీళ్లు పెట్టుకున్న కెమెరామెన్

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య గడాఫీ వేదికగా నిన్న మూడవ వన్డే జరిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్ లెఫ్ట్ హ్యాండర్ అరాఫత్ మిన్హాస్ ( Arafat Minhas ) లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మ్యాట్ రెన్‌షా వేసిన ఓ అద్భుత‌మైన బంతిని షాట్ ఆడ‌బోయి, స్లిప్ లో కామెరాన్ గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
పాకిస్తాన్ జట్టును గెలిపించే ప్రయత్నంలో 9 ప‌రుగుల వ‌ద్ద అరాఫత్ మిన్హాస్… వికెట్ కోల్పోగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆయన తండ్రి. ఈ మ్యాచ్ లో కెమెరామెన్ గా ఉన్న అర‌ఫ‌త్ మిన్షాస్ తండ్రి, త‌న కొడుకు వికెట్ కోల్పోగానే ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇక ఈ సంఘటన వీడియో వైరల్ గా మారడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ఒక కొడుకు ఇలా వికెట్ పోగొట్టుకుంటే ఏ తండ్రి అయినా బాధపడాల్సిందేనని.. పాకిస్తాన్ గడ్డపై కూడా ఇదే జరిగిందని పేర్కొంటున్నారు. తండ్రి పాకిస్తానోడైనా..? మరో వ్యక్తి అయినా సరే? కన్న ప్రేమ మాత్రం ఒకటేనని అంటున్నారు.

పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు 54 రోజుల సెలవులు

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ముగిసిన వెంటనే, బంగ్లాదేశ్ వెళ్లి దారుణంగా టెస్టుల్లో ఓడిపోయింది పాకిస్తాన్. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడింది పాకిస్తాన్. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రానించి పాకిస్తాన్ విజయ దుందుభి మోగించింది. నిన్నటితో వన్డే సిరీస్ ముగిసిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు 54 రోజుల సెలవులు లభించబోతున్నాయట. జులై 26వ తేదీ వరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మళ్లీ సిరీస్ లు లేవు. అందుకే, పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు 54 రోజులపాటు అంటే దాదాపు రెండు నెలల పాటు హాలిడేస్ లభించనున్నాయి. దీంతో లాహోర్ నుంచి నేరుగా తమ ఇండ్లకు వెళ్లిపోయారు పాకిస్థాన్ క్రికెటర్లు. ఫ్యామిలీతో రెండు నెలల పాటు గడిపేందుకు.. క్రికెటర్లకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Advertisement

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Big Stories

Advertisement
×