E-Paper
Advertisement

రెవెన్యూ అధికారి ఇళ్లపై ఏసీబీ పంజా.. లగ్జరీ కార్లు, ఫ్లాట్లు చూసి అధికారులే షాక్!

రెవెన్యూ అధికారి ఇళ్లపై ఏసీబీ పంజా.. లగ్జరీ కార్లు, ఫ్లాట్లు చూసి అధికారులే షాక్!
Advertisement

Kakinada: కాకినాడ జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న రెవెన్యూ అధికారి శివరామకృష్ణ (శివరాం కుమార్) నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన మెరుపు దాడులు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ.. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కోట్ల విలువైన అక్రమ ఆస్తులను బట్టబయలు చేసింది.

ఏకకాలంలో నలువైపులా సోదాలు

Advertisement

ప్రత్యేక న్యాయస్థానం అనుమతితో జూన్ 5న ఏసీబీ అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. కాకినాడలోని శివరామకృష్ణ నివాసం, ఆయన కార్యాలయంతో పాటు సోదరి, మామగారి ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఈయన ఇళ్లలో దొరికిన సంపద చూసి అధికారులే విస్తుపోయారు.

విలాసవంతమైన ఫ్లాట్లు, భూములు

Advertisement

సోదాల్లో భారీగా స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. కాకినాడ ఎస్‌ఆర్‌ఎంటీ మాల్ వెనుక ఒక 3BHK ఫ్లాట్, ఆయన భార్య పేరిట మరో 4BHK లగ్జరీ ఫ్లాట్ ఉన్నట్లు తేలింది. వీటితో పాటు తెలంగాణలోని ఐటీ హబ్ కొండాపూర్‌లో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్, రామారావుపేటలో ఖరీదైన స్థలం, పలుచోట్ల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

కోట్లలో లగ్జరీ కార్లు, బంగారం

నిందితుడి ఇంట్లో లగ్జరీ వాహనాల జాతరే కనిపించింది. ఒక టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా ఎలక్ట్రిక్ BE6 కారుతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న మహీంద్రా థార్ రాక్స్ వాహనాన్ని ఏసీబీ సీజ్ చేసింది. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని అంచనా. ఇవే కాకుండా 700 గ్రాముల బంగారు ఆభరణాలు, భారీగా నగదు, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, ప్రీమియం మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల పూర్తి విలువను లెక్కించే పనిలో ఉన్న అధికారులు, సోదాలు ముగిశాక పూర్తి నివేదికను విడుదల చేయనున్నారు.

Also Read: భీంగల్‌లో ఘోర విషాదం.. నీటికుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం!

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×