E-Paper
Advertisement

లిఫ్ట్ అడిగింది.. ఫోన్ కొట్టేసింది.. సీన్ కట్ చేస్తే నడిరోడ్డుపై ఊహించని ట్విస్ట్..వైరల్ వీడియో !

లిఫ్ట్ అడిగింది.. ఫోన్ కొట్టేసింది.. సీన్ కట్ చేస్తే నడిరోడ్డుపై ఊహించని ట్విస్ట్..వైరల్ వీడియో !
Advertisement

Jaipur Viral Video: సహాయం చేయడమే ఆ యువకుడు చేసిన నేరం.. అర్ధరాత్రి వేళ రోడ్డు పక్కన ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో నిలబడిన ఒక అమ్మాయిని చూసి జాలిపడ్డ అతడు, మానవత్వంతో బైక్ ఆపి లిఫ్ట్ ఇచ్చాడు. కానీ, ఆ నమ్మకమే అతడికి శాపంగా మారింది. కాసేపటికే సదరు యువతి తన అసలు రంగు బయటపెట్టి, ఏకంగా సాయం చేసిన వ్యక్తి ఫోన్‌నే కొట్టేసింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగినట్లు  భావిస్తున్న  ఈ న్యూస్  ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. నట్టనడిరోడ్డుపై జరిగిన ఈ హైడ్రామాకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో, ఇకపై రోడ్డుపై ఎవరికైనా సాయం చేయాలంటేనే జనం వణికిపోయే పరిస్థితి .

వివరాల్లోకి వెళ్తే.. ఒక యువకుడు అర్ధరాత్రి సమయంలో తన బైక్‌పై వెళ్తుండగా, ఒక యువతి రోడ్డు పక్కన నిలబడి లిఫ్ట్ అడిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, పైగా సమయం చాలా దాటిపోవడంతో ఆ యువకుడు మంచి మనసుతో ఆలోచించాడు. ఒంటరిగా ఉన్న మహిళకు రక్షణగా నిలవాలనుకుని ఆమెను తన బండిపై ఎక్కించుకున్నాడు. అయితే, ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే ఆ యువతి అత్యంత చాకచక్యంగా అతడి జేబులో ఉన్న మొబైల్ ఫోన్‌ను దొంగిలించింది. అయితే, రైడింగ్‌లో ఉన్నప్పటికీ ఆ యువకుడు అప్రమత్తంగా ఉండి, తన ఫోన్ పోయిందనే విషయాన్ని వెంటనే గమనించాడు. వెంటనే బండి ఆపి, సదరు యువతిని నిలదీసి గట్టిగా పట్టుకున్నాడు.

Advertisement

దీంతో ఆ ప్రాంతంలో పెద్ద రచ్చ మొదలైంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఆ యువకుడు సదరు యువతి చేతిని గట్టిగా పట్టుకుని, చుట్టుపక్కల వారికి ఆమె చేసిన మోసాన్ని చూపిస్తున్నాడు. “చూడండి, ఈమె నా దగ్గర లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించింది.. ఇదిగో నా ఫోన్” అంటూ ఒక చేత్తో మొబైల్‌ను, మరో చేత్తో ఆమెను పట్టుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే, తప్పు చేసి దొరికిపోయిన ఆ యువతిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించకపోగా, తన ముఖాన్ని కెమెరాకు కనిపించకుండా దాచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించడం వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది.

Advertisement

also read :పెళ్లయిన నాలుగేళ్లకే షాకింగ్ నిర్ణయం.. 42 ఏళ్ల వయసులో మళ్లీ ఒంటరిగా మారిన స్టార్ హీరోయిన్!

తెలివిగా తప్పించుకున్న యువతి 

అంతటితో ఆగకుండా, సీన్ రివర్స్ చేయడానికి ఆ యువతి దొంగే దొంగ అన్నట్లుగా ఎదురుదాడికి దిగింది. దొంగతనం బయటపడటంతో చుట్టుపక్కల జనాలు గుమిగూడటం గమనించిన ఆమె, సదరు యువకుడిని బూతులతో తిట్టడం మొదలెట్టింది.. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ఆ యువకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ నిందలు వేయడం మొదలుపెట్టింది. “ఇంత తప్పు చేసి కూడా నన్నే తిడుతోంది.. నాపైనే తప్పుడు ఆరోపణలు చేస్తోంది” అని ఆ యువకుడు అక్కడున్న వారి ముందు లబోదిబోమన్నాడు. కాసేపటి తర్వాత అక్కడి గందరగోళం, జనం ఒత్తిడి మధ్య యువకుడు కాస్త పట్టు వదిలేయడంతో, ఆమె అక్కడి నుంచి తెలివిగా తప్పించుకుంది

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు 

ఈ షాకింగ్ వీడియో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విపరీతంగా షేర్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆ యువకుడి దగ్గర ఈ వీడియో సాక్ష్యం లేకపోయి ఉంటే, అక్కడ ఉన్న జనం ఆ అమ్మాయి మాటలు నమ్మి, బాధితుడినే దొంగను చేసి నడిరోడ్డుపై దాడి చేసేవారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొందరు యూజర్లు తమ చేదు అనుభవాలను పంచుకుంటూ, రోడ్డుపై ముఖ్యంగా మహిళలకు సాయం చేసేటప్పుడు చట్టాలు మనకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నేరగాళ్ల వల్లే, రేపు నిజంగా ఆపదలో ఉండి సాయం కోసం ఎదురుచూసే అమాయక మహిళలకు కూడా సమాజంలో ఎవరూ హెల్ప్ చేసే పరిస్థితి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రత దృష్ట్యా ఇలాంటి సమయాల్లో లిఫ్ట్ ఇచ్చే బదులు, పోలీసులకు సమాచారం ఇవ్వడమే ఉత్తమమని పలువురు సూచిస్తున్నారు.

also read :రూ. 4000 కోట్లా? అంత సీన్ లేదు..‘రామాయణ’, ‘వారణాసి’లపై మనోజ్ భాజ్‌పేయి సెన్సేషన్ కామెంట్స్

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×