E-Paper
Advertisement

T20 World Cup 2026: జియో హాట్ స్టార్ వైదొలగడానికి కారణం ఇదే.. ఏకంగా రూ.138 కోట్లు కొంపముంచిందా

T20 World Cup 2026: జియో హాట్ స్టార్ వైదొలగడానికి కారణం ఇదే.. ఏకంగా రూ.138 కోట్లు కొంపముంచిందా
Advertisement

T20 World Cup 2026 :  2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కి మందు ఇంటర్నేషనల్ క్రికెట్ మండలితో పాటు భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కు షాక్ తగిలిందనే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే..? ఐసీసీ బ్రాడ్ కాస్టింగ్ నుంచి JioHotstar త‌ప్పుకుంటున్నట్టు వార్త‌లు వినిపించాయి.దీంతో టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ ఇప్పుడు కొత్త భాగస్వాములను వెతకాల్సి ఉంది.అయితే, ICC బ్రాడ్‌కాస్టింగ్ నుంచి JioHotstar తప్పుకోడానికి గల కారణాలు ఇవే అని తెలుస్తోంది. దీనికి ప‌లు కార‌ణాలు చూస్తే.. ఒక్కో మ్యాచ్ కి జియో రూ.138 కోట్లు చెల్లిస్తోంది. ఇది ఐపీఎల్ మ్యాచ్ రూ.114 కంటే ఎక్కువ‌. మ‌రోవైపు 179 ఐసీసీ మ్యాచ్ ల్లో భార‌త్ 28 మాత్ర‌మే ఆడుతోంది. మిగ‌తా దేశాల‌వి అయితే వ్యూవ‌ర్ షిప్, యాడ్ రెవెన్యూ త‌క్కువ వ‌స్తాయి. అయితే ఇప్పుడు బ‌ల‌మైన పోటీదారుడు లేక‌పోవ‌డంతో ప్రైస్ త‌గ్గించి త‌మ‌కే కాంట్రాక్ట్ ఇస్తార‌ని జియో భావిస్తోంది.

Also Read : ICC ODI rankings: నెంబ‌ర్ 1, 2 ర్యాంకింగ్స్ లో రోహిత్‌, కోహ్లీ..గంభీర్ ఇక ఉరేసుకోవాల్సిందే అంటూ ట్రోల్స్ ?

ఐసీసీ అలెర్ట్

Advertisement

ముఖ్యంగా ఐసీసీ టీ-20 ప్ర‌పంచ క‌ప్ 2026 కి ఇంకా కేవ‌లం రెండు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉన్న విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఐసీసీ మీడియా హ‌క్కుల ఒప్పందం ప్ర‌కారం.. జియో హాట్ స్టార్ కుదుర్చుకుంది. కానీ ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా జియో హాట్ స్టార్ వైదొల‌గాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ మేర‌కు ఐసీసీకి జియో హాట్ స్టార్ యాజ‌మాన్యం స‌మాచారం ఇచ్చిన‌ట్టు నేష‌న‌ల్ మీడియాలో ప‌లు క‌థ‌నాలు వెల్ల‌డైన విష‌యం విధిత‌మే. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా ఈ వార్త తెగ వైర‌ల్ కావ‌డం విశేషం. ఆర్థికంగా మీడియా హ‌క్కుల‌ను వ‌దులుకున్న‌ద‌ని జియో హాట్ స్టార్ వార్త ఎప్పుడైతే బ‌య‌టికీ వ‌చ్చిందో.. ఆ మ‌రు క్ష‌ణ‌మే ఐసీసీ అలెర్ట్ అయిన‌ట్టు చెబుతున్నారు.

మూడు ప్ర‌ధాన ఓటీటీ సంస్థ‌ల‌కు ఆహ్వానం

జియో హాట్ స్టార్ స్థానంలో మిగిలిన ఓటీటీ సంస్థ‌ల‌కు ఆహ్వానం కూడా ప‌లికిన‌ట్టు స‌మాచారం. టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ కి సంబంధించిన మీడియా హ‌క్కుల‌ను పొందేందుకు మూడు ప్ర‌ధాన ఓటీటీ సంస్థ‌ల‌కు ఆహ్వానం ప‌లికింద‌ట ఐసీసీ. జియోస్టార్ నిష్క్ర‌మ‌ణ‌తో సోనీ స్పోర్ట్స్ నెట్ వ‌ర్క్, నెట్ ఫ్లిక్స్, అమోజాన్ ప్రైమ్ ల‌ను ఐసీసీ సంప్ర‌దించింద‌ట‌. ఇందులో నెట్ ఫ్లిక్స్ ఫైన‌ల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ట్టు వార్త‌లు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇందులో వాస్త‌వం ఎంత ఉంద‌నేది మాత్రం తెలియ‌దు. ఒక‌వేళ నెట్ ఫ్లిక్స్ కి ఐసీసీ మీడియా హ‌క్కులు వెళ్లితే.. క్రికెట్ అభిమానులు స‌బ్ స్క్రిప్ష‌న్ ని డ‌బ్బులు పెట్టి అయితే చేసుకోవాల్సిందే. అయితే జియో హాట్ స్టార్ మీడియా హ‌క్కుల‌ను వ‌దులుకొని ఎంత ప‌ని చేసిందిర మామ‌. మ్యాచ్ చూడాలంటే ఇప్పుడు మ‌ళ్లీ డ‌బ్బులు చెల్లించాల్సిందేనా..? అంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకోవ‌డం విశేషం.

Advertisement

Also Read : Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×