E-Paper
Advertisement

Aus vs Eng : యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఘోర ఓటమి.. WTC పట్టికలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా

Aus vs Eng : యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఘోర ఓటమి.. WTC పట్టికలో అగ్రస్థానానికి ఆస్ట్రేలియా

Aus vs Eng : ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. 65 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంత‌కు ముందు తొలి ఇన్నింగ్స్ లోఓ ఇంగ్లండ్ 334, ఆస్ట్రేలియా 511 ర‌న్స్ స్కోర్ చేశాయి. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 241కే ప‌రిమిత‌మై ఆసీస్ కి స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టెస్ట్ లో ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో స్టార్క్ 08, నెసెర్ 6 వికెట్లు ప‌డ‌గొట్టారు. ఈ విక్ట‌రీతో 5 మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా 2-0తో లీడ్ లో ఉంది. ఆస్ట్రేలియా విజ‌యం సాధించ‌డంతో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. 60 పాయింట్ల‌తో టాప్ ప్లేస్ లో కొన‌సాగుతోంది. ఆడిన 5 టెస్ట్ మ్యాచ్ ల‌కు 5 మ్యాచ్ ల్లో విజ‌యం సాధించింది. ఒక్క మ్యాచ్ లో కూడా ఓట‌మి పాల‌వ్వ‌లేదు. సౌతాఫ్రికా 3 మ్యాచ్ ల్లో విజ‌యం సాధించి 1 మ్యాచ్ ఓట‌మి పాల‌వ్వ‌డంత పాయింట్ల ప‌ట్టిక‌లో 75 పాయింట్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతోంది.

Also Read : Smriti Mandhana : ప‌లాష్ ప‌చ్చి మోస‌గాడా? పెళ్లి రద్దుపై స్మృతి మందాన అధికారిక ప్ర‌క‌ట‌న‌

రెండో టెస్ట్ కూడా ఆస్ట్రేలియాదే..!

WTC వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా శ్రీలంక ప్ర‌స్తుతం 66.67 పాయింట్ల ప‌ర్సెంట్ తో పాటు 16 పాయింట్ల‌తో మూడో స్థానంలో కొన‌సాగుతుంది. పాకిస్తాన్ జ‌ట్టు 50 శాతంతో 12 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది. టీమిండియా 48.15 ప‌ర్సెంటేజీతో పాటు 52 పాయింట్ల‌తో 4 మ్యాచ్ టెస్టులు కోల్పోయి పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం 5వ స్థానంలో కొన‌సాగుతోంది. న్యూజిలాండ్ 33.33 ప‌ర్సెంటేజ్ తో పాటు 4 పాయింట్ల‌తో 6వ స్థానం, 30.95 ప‌ర్సెంటేజ్ తో ఇంగ్లండ్ 7వ స్థానం, బంగ్లాదేశ్ 16.67 శాతంతో 8వ స్థానం, వెస్టిండీస్ 5.56 ప‌ర్సెంటేజ్ తో తో 9వ స్థానంలో కొన‌సాగుతున్నాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జ‌ట్లు అన్ని కూడా 4 పాయింట్లతో కొన‌సాగ‌డం విశేషం. ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ జ‌ట్టు ఆస్ట్రేలియా చేతిలో వ‌రుస‌గా రెండో టెస్ట్ లో కూడా ఘోర ప‌రాజయం పాలైంది.

రెండింటిలో స‌త్తా..

సొంత‌గ‌డ్డ పై జ‌రుగుతున్న యాసెస్ 2025 సిరీస్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో స‌త్తా చాటి వ‌ర‌స‌గా రెండో విజ‌యం సాధించింది. గ‌బ్బా వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్ట్ లో కంగారులు 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జ‌ట్టును ఓడించింది. రెండో ఇన్నింగ్స్ లో 134-6 తో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్.. 241 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. బెన్ స్టోక్స్ (50). విల్ జాక్స్ 41, ఏడో వికెట్ కి 96 ప‌రుగులు జోడించారు. నీస‌ర్ (5-42) ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశారు. స్టార్క్ 2, బోలాండ్, డ‌గెట్ ఒక వికెట్ తీశారు. 65 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా జ‌ట్టు ఏవ‌లం 10 ఓవ‌ర్ల‌లోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టీవ్ స్మిత్ 23, ట్రావిస్ హెడ్ 22, వెద‌ర్ రాల్డ్ 17 ప‌రుగులు చేశారు. ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా మూడో టెస్ట్ డిసెంబ‌ర్ 17 నుంచి ఆడిలైడ్ లో ప్రారంభం కానుంది.

Also Read : Virat Kohli: అదృష్టం బాగుంది.. లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణ సెంచరీ చేసేవాడు.. సెల్ఫీ వీడియోలో ఆడుకున్న కోహ్లీ

Related News

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

Big Stories

×