E-Paper
Advertisement

Smriti Mandhana : ప‌లాష్ ప‌చ్చి మోస‌గాడా? పెళ్లి రద్దుపై స్మృతి మందాన అధికారిక ప్ర‌క‌ట‌న‌

Smriti Mandhana : ప‌లాష్ ప‌చ్చి మోస‌గాడా? పెళ్లి రద్దుపై స్మృతి మందాన అధికారిక ప్ర‌క‌ట‌న‌

Smriti Mandhana : భార‌త స్టార్ మ‌హిళా క్రికెట‌ర్ స్మృతి మంధాన పెళ్లి విష‌యం పై ఎట్ట‌కేల‌కు ఓ క్లారిటీ వ‌చ్చింది. ముఖ్యంగా పెళ్లి గురించి రోజుకొక వార్త వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్మృతి మంధాన వివాహం విష‌యం పై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌న పెళ్లి ర‌ద్దు అయిన‌ట్టు ఆమె ఇన్ స్టా స్టోరీలో ప్ర‌క‌టించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌లాశ్ ముచ్చ‌ల్ తో న‌వంబ‌ర్ 23న జ‌ర‌గాల్సిన పెళ్లి ప‌లు కార‌ణాల‌తో వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.” గ‌త కొద్ది వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహ‌గానాలు సాగాయి. ఇలాంటి స‌మ‌యంలో నేను మాట్లాడ‌టం చాలా ముఖ్యం. నా గురించి అన్ని ర‌హ‌స్యంగా ఉండాల‌ని భావిస్తున్నాను. కానీ వివాహం ర‌ద్దు అయింద‌ని అంద‌రికీ తెలియ‌జేయాల‌నుకుంటున్నా. ఈ విష‌యాన్ని ఇక్క‌డితో ముగిస్తార‌ని భావిస్తున్నా. రెండు కుటుంబాల గోప్య‌త‌ను గౌర‌వించి.. ముందుకు సాగేందుకు స్పేస్ ఇవ్వాల‌ని అభ్య‌ర్థిస్తున్నా.

Also Read : Virat Kohli: అదృష్టం బాగుంది.. లేకపోతే అర్షదీప్ సింగ్ సెంచరీ చేసేవాడు.. సెల్ఫీ వీడియోలో ఆడుకున్న కోహ్లీ

స్మృతి మంధాన స్టోరీ వైర‌ల్

దేశాన్ని అత్యున్న‌త స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతా. భార‌త్ త‌ర‌పున మ‌రిన్ని మ్యాచ్ ల‌ను ఆడి గ్రోఫీలు గెలుస్తా. నాకు మ‌ద్ద‌తు ఇచ్చిన వారందరికీ ధ‌న్య‌వాద‌ములు. ముందుకు సాగాల్సిన స‌మ‌యం ఆసన్న‌మైంది” అని స్మృతి మంధాన స్టోరీలో రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఆమె ఇన్ స్టా గ్రామ్ స్టోరీ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్, స్మృతి మంధానల పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు మంధాన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పలాష్ ముచ్చల్ సైతం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసినట్లు ఇరు కుటుంబాలు ప్రకటించాయి. అయితే పెళ్లి విషయంలో మంధాన మనసు మార్చుకున్నారని.. పెళ్లి రద్దు చేసుకున్నారని రెండు, మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఆమె కూడా ఇన్‌స్టాలో పెళ్లికి ముందు పోస్టు చేసిన ఫొటోలను డిలీట్ చేసింది.

వాటికి తెర‌దించాల‌నే..!

అంతేకాకుండా శుక్రవారం స్మృతి పోస్ట్ చేసిన ఒక బ్రాండ్ ప్రమోషనల్ వీడియోలో ఆమె చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపించలేదు. దీంతో ఆమె పెళ్లి రద్దు అయినట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై మంధాన అధికారిక ప్రకటన చేశారు. వాస్త‌వానికి 2019 నుంచి ప్రేమలో ఉన్నారు. పెళ్లి పీటలు ఎక్కడం, మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కావడమే ఆలస్యం అనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా తన జీవితంపై చాలా ఊహాగానాలు వచ్చాయని, ఈ సమయంలో మాట్లాడటం చాలా ముఖ్యం అని అనిపించిందని చెప్పారు. ప్రైవసీని కోరుకునే మహిళనని, అలాగే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. అన్ని ఊహాగానాలకు తెర దించాలనే ఉద్దేశంతోనే పెళ్లి రద్దయిందనే విషయాన్ని అధికారికంగా తెలియజేస్తోన్నానని అన్నారు. పెళ్లిపై జరిగిన చర్చలు మానసిక వేదనను కలిగించాయని మంధాన స్పష్టం చేశారు.

Also Read : Gambhir vs Parth Jindal: పార్థ్ జిందల్ కు ఇచ్చిప‌డేసిన గంభీర్‌.. అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఏంటీ?

Related News

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

Big Stories

×