E-Paper
Advertisement

Top 20 News: దళిత మహిళపై ఏసీపీ లైంగిక వేధింపుల ఆరోపణలు, రామ్మోమన్ నాయుడు పనితీరుపై మాజీ మంత్రి విమర్శలు

Top 20 News: దళిత మహిళపై ఏసీపీ లైంగిక వేధింపుల ఆరోపణలు, రామ్మోమన్ నాయుడు పనితీరుపై మాజీ మంత్రి విమర్శలు

1. గ్లోబల్ సమ్మిట్.. ఆదేశాలు జారీ

గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. జరుగుతున్న ఏర్పాట్లు, ప్రగతి పనులను మంత్రి సమీక్షించారు. వ్యవసాయ, ఇతర విభాగాల వారీగా జరుగుతున్న సమన్వయంపై అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేసి తగు చర్యలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

2. దళిత మహిళపై ఏసీపీ లైంగిక వేధింపుల ఆరోపణలు

హైదరాబాద్ మిర్చౌక్ ఏసీపీపై ఓ దళిత మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఇంటి ముందు కారు పెట్టి వేధిస్తున్నాడని జూన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో ఏసీపీ ప్రవర్తనపై వీడియో విడుదల చేసింది. ఒంటరిగా రావాలని, తనతో గడపాలని ఏసీపీ ఫోన్‌లో ఒత్తిడి చేస్తున్నాడని ఆమె ఆరోపించింది.

3. తెలంగాణ బీజేపీ మహాధర్నా

రెండేళ్ల ప్రజాపాలనా విజయోత్సవాలను నిర్వహిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ బీజేపీ దీనిపై మహాధర్నా నిర్వహించనుంది. మహాధర్నాలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నారు. ప్రజావంచన పేరిట మహాధర్నా నిర్వహించనున్నారు.

4. అధికారులు కూల్చివేతలు

మియాపూర్ ప్రాంతంలో పటేల్ చెరువు నుంచి గంగారం చెరువుకు వెళ్లే ప్రధాన నాలా ఆక్రమణపై హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు తమ క్రీడా మైదానానికి అడ్డుగా ఉందని భావించి.. నాలాలో మట్టిని నింపి అక్రమంగా కబ్జా చేశారని హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో కూల్చివేశారు.

5. ఎన్నికల బరిలో ముగ్గురు యువతులు

మంచిర్యాల జిల్లా చింతగూడలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు చదువుకున్న యువతులు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో ప్రజా రంగంలోకి అడుగుపెట్టిన వీరిపై ఇప్పుడు ఓటర్ల తీర్పు ఆసక్తిగా మారింది. ఉన్నత చదువులు పూర్తి చేసిన సుప్రియ, సుమలత, శ్రావణి.. తమకు నచ్చిన జీవిత భాగస్వాములను ప్రేమవివాహం చేసుకున్నారు.

6. రేషన్ బియ్యం స్వాధీనం

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వీరాంజనేయ ట్రేడర్స్ రైస్ మిల్లుపై సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 300 బస్తాలకు పైగా రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ప్రస్తుతం బియ్యాన్ని తూకం వేస్తున్నారు. రైస్ మిల్లు యజమాని అందుబాటులో లేరు.

7. ఎన్నికల జోరు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ గా నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.

8. తెలుగువాళ్లు సత్తా చాటారు

తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. డాలస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికాలో తెలుగువాళ్లు సత్తా చాటారు. మాకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం. కష్టకాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారన్నారు.

9. తీవ్ర ఆగ్రహం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటం ప్రదర్శించారు. ఆలయానికి చెందిన సుమారు ఐదు కేజీల వెండి, అమ్మవారి విలువైన చీరలు, ఇతర వస్తువులను ఒక సంచిలో వేసుకొని ఆటోలో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. భక్తులు, స్థానికులు ఆయనను పట్టుకున్నారు.

10. రామ్మోమన్ నాయుడు పనితీరుపై మాజీ మంత్రి విమర్శలు

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదు రోజులుగా దేశంలో విమానయాన రంగంలో నెలకొన్న గడ్డు పరిస్థితులు, ప్రయాణీకుల ఇబ్బందులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

11. నోటిఫికేషన్ జారీ

కడప నగర కొత్త మేయర్ ఎంపికకు జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 11న ప్రత్యేక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేవలం మూడు నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ సామాజికవర్గ కార్పొరేటర్లు ఈ పీఠం కోసం పోటీపడుతున్నారు.

12. అధికారులపై ఆగ్రహం

అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి రేవు నుంచి నరసాపురం వెళ్లే పంటు ప్రయాణం నిత్యం వందలాది మంది ఉపయోగిస్తున్న ముఖ్యమైన రవాణా మార్గం. సాంకేతిక లోపంతో గోదావరి మధ్యలో దాదాపు అరగంట ఆగిపోయింది. పంటులో ఉన్న 80 మంది ప్రయాణికులు ఆందోళన చెందారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

13. నరసరావుపేటలో దారుణం..

కుటుంబ కలహాల కారణంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో శ్రీకాంత్ అనే భర్త తన భార్య త్రివేణిని, ఏడు నెలల పసిబిడ్డను ఎన్ఎస్ పి కాలువలోకి నెట్టి చంపేశాడు. భార్య మృతదేహం దొరికింది, బిడ్డ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో హత్య కేసుగా నమోదు చేసి భర్త శ్రీకాంత్ ని అదుపులోకి తీసుకుని రూరల్ పోలీసులు విచారిస్తున్నారు.

14. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌లోని బ్యాటరీ-3 ఏరియాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ఛార్జింగ్ కారు మంటల్లో కాలిపోయింది. ఛార్జింగ్ కారు-7 టెలిస్కోప్ ఛార్జింగ్ పూర్తైన తర్వాత లిఫ్ట్ అవ్వకపోవడంతో సమస్య తలెత్తింది. ఈ లోపం కారణంగా ఓవెన్‌ నుంచి వచ్చిన మంటలు ఛార్జింగ్ కారుకు అంటుకున్నాయి.

15. ఏలూరు జిల్లాలో భారీ చోరీ

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పగడ రాము అనే స్వర్ణ కారుడు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదుతో పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసినా ఫలితం లేకపోవడంతో, బాధితులు న్యాయం కోసం జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు వినతులు అందజేశారు.

16. భక్తుల రద్దీ

శ్రీశైల మహా క్షేత్రానికి భక్తులు పోటెత్తారు ఆదివారం సెలవు రోజు కావడంతో నిన్నటి నుంచే క్షేత్రంలో రద్దీ నెలకొంది. వేకువజామునుండే భక్తులు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్ లో కంపార్ట్మెంటులలో వేచి ఉన్నారు. వేచి ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సిబ్బందికి యువ శ్రీనివాసరావు ఆదేశించారు.

17. అగ్నిపర్వతం విస్ఫోటనం

అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికివస్తోంది. 100 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతోంది. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని స్పష్టం చేశారు.

18. రిఫండ్ ఇచ్చేందుకు చర్యలు

ఇండిగో విమానాల రద్దు సంక్షోభానికి సంబంధించి ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు సమావేశమయ్యారు. సంక్షోభానికి దారితీసిన కారణాలపై ఆరా తీశారు. సమస్య పరిష్కారానికి ఛైర్మన్‌, సీఈవో, బోర్డు మెంబర్లతో కలిపి క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇండిగో విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఈ గ్రూప్‌ చర్యలు తీసుకోనుంది.

19. చట్టానికి కట్టుబడి ఉండాలి

మనమెప్పుడూ చట్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని రానా దుగ్గుబాటి అన్నారు. చట్టం ఈతన పని తాను చేసుకుంటూ వెళుతుందని పేర్కొన్నారు. ముంబయిలో ఒక ఈవెంట్ లో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

20. ఆల్‌రౌండర్‌గా మారే అవకాశం

టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా రానున్న రోజుల్లో బౌలింగ్ ఆల్ రౌండర్‌గా మారే అవకాశముంది. అతడిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని భారత హెడ్ కోచ్ గంభీర్ వెల్లడించారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌లో ప్రభావం చూపించే సత్తా అతడికి ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×