E-Paper
Advertisement

Virat Kohli: అదృష్టం బాగుంది.. లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణ సెంచరీ చేసేవాడు.. సెల్ఫీ వీడియోలో ఆడుకున్న కోహ్లీ

Virat Kohli: అదృష్టం బాగుంది.. లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణ సెంచరీ చేసేవాడు.. సెల్ఫీ వీడియోలో ఆడుకున్న కోహ్లీ
Advertisement

Virat Kohli: విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మూడవ వన్డే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి భారత్ సిరీస్ ని 2-1 తో కైవసం చేసుకుంది. సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేదించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ చేరో 4 వికెట్లు పడగొట్టి సఫారీల ఓటమిని శాసించారు. ఇక బ్యాటింగ్ లో యశస్వి జైష్వాల్ {116*}, రోహిత్ శర్మ {75}, విరాట్ కోహ్లీ {65*} అద్భుతంగా రాణించారు.

Also Read: Gambhir vs Parth Jindal: పార్థ్ జిందల్ కు ఇచ్చిప‌డేసిన గంభీర్‌.. అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఏంటీ?

Advertisement

అయితే ఈ సిరీస్ ఆధ్యాంతం విరాట్ కోహ్లీ జోష్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మూడవ వన్డేలో విజయం సాధించిన అనంతరం విరాట్ కోహ్లీ ట్రోలింగ్ కి పేసర్ అర్షదీప్ సింగ్ బలయ్యాడు. మరోవైపు సోషల్ మీడియాలో ప్రసిద్ద్ కృష్ణ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇంతకీ అర్షదీప్ సింగ్ ని విరాట్ కోహ్లీ ఎలా ట్రోల్ చేశాడు..? ప్రసిద్ద్ కృష్ణ ని నెటిజన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు..? అనే విషయాలను తెలుసుకుందాం.

 

అర్షదీప్ సింగ్ సెంచరీ మిస్ అయ్యిందన్న విరాట్ కోహ్లీ:

Advertisement

ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ వరుసగా రెండు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా మూడు మ్యాచ్లలో 302 పరుగులు చేశాడు. దాదాపు 150 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయడం గమనార్హం. మొదటి రెండు వన్డేలలో సెంచరీలు, మూడవ వన్డేలో {65*} హాఫ్ సెంచరీ తో ఈ సిరీస్ లో భారత్ విజయం సాధించేలా చేశాడు. ఈ సిరీస్ లో మొత్తంగా విరాట్ కోహ్లీ ఆధిపత్యం కనిపించింది. మూడు మ్యాచ్ ల ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో 300కు పైగా పరుగులు సాధించడం విరాట్ కోహ్లీ కెరీర్ లో ఇదే మొదటిసారి. ఇక ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు కోహ్లీ.

అయితే మూడవ వన్డేలో యశస్వి జైష్వాల్, రోహిత్ శర్మ 155 పరుగుల భాగస్వామ్యంతో.. సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన 271 పరుగులలో సగం పరుగులను పూర్తి చేశారు. అనంతరం విరాట్ కోహ్లీ 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లక్ష్యాన్ని చేదించడంతో హైట్రిక్ సెంచరీ మిస్ అయింది. ఇక మ్యాచ్ అనంతరం అర్షదీప్ సింగ్ సరదాగా తన మొబైల్లో సెల్ఫీ వీడియో తీస్తూ విరాట్ కోహ్లీని ప్రశ్నించాడు. “పాజీ.. పరుగులు తక్కువయ్యాయి. లేదంటే మరో సెంచరీ పక్కా అయ్యేది. హ్యాట్రిక్ మిస్ అయింది” అన్నాడు. దీంతో విరాట్ కోహ్లీ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ” నా సెంచరీ ఏమో కానీ.. టాస్ గెలవకపోతే ఈ మంచుకి బౌలింగ్ లో నీకు సెంచరీ పక్కా అయ్యేది”. అన్నాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు.

 

ప్రసిద్ద్ కృష్ణ పై ట్రోలింగ్:

బౌలింగ్ లో నీకు సెంచరీ మిస్ అయ్యేది అంటూ అర్షదీప్ సింగ్ ని ఉద్దేశించి విరాట్ కోహ్లీ చేసిన ట్రోలింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియోని ఉపయోగించి ప్రసిద్ద్ కృష్ణ పై ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు. ఈ సిరీస్ లో అర్షదీప్ సింగ్ బౌలింగ్ కాస్త పరవాలేదని.. ప్రసిద్ బౌలింగ్ మాత్రం చాలా చెండాలంగా ఉందని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా రాయిపూర్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో అత్యధిక పరుగులు ఇచ్చి ప్రసిద్ద్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

Also Read: Gautam Gambhir: పొర్లు దండాలు పెట్టినా, 2027 వరల్డ్ కప్ లో ఆ ఇద్దరినీ ఆడనివ్వను ?

ప్రసిద్ కారణంగానే రెండవ వన్డేలో భారత్ ఓడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మ్యాచ్ లో ఏకంగా 85 పరుగులు ఇచ్చాడు. ఇక చివరి వన్డేలో అందరు బౌలర్ల కంటే అధికంగా 66 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. అయితే విరాట్ కోహ్లీ.. అర్షదీప్ సింగ్ ని సెంచరీ మిస్ అయ్యావు అని అన్న విధంగానే.. ప్రసిద్ద్ కృష్ణ అయితే 200 కొట్టేసేవాడని మీమ్స్ తో ట్రోలింగ్ చేస్తున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by RP Trolls (@rp.trolls)

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×