E-Paper
Advertisement

Vaibhav Vs Siraj: వైభ‌వ్ పగలగొట్టేయ్ అంటూ ఆశిష్ నెహ్రా హింట్..అన్నంత ప‌ని చేసిన సిరాజ్

Vaibhav Vs Siraj: వైభ‌వ్ పగలగొట్టేయ్ అంటూ ఆశిష్ నెహ్రా హింట్..అన్నంత ప‌ని చేసిన సిరాజ్
Advertisement

Vaibhav Vs Siraj: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament ) భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals vs Gujarat Titans, 52nd Match) మధ్య కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కూడా రెండవ స్థానానికి దూసుకు వెళ్లింది గుజరాత్ టైటాన్స్. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భయంకరమైన వైభవ్ సూర్యవంశీని (Vaibhav Suryavanshi ) మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj ) చాలా తెలివిగా ఔట్ చేశాడు. అతన్ని ఔట్ చేయకపోతే, రాజస్థాన్ రాయల్స్ అవలీలగా గెలిచేదని చెబుతున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీని మహమ్మద్ సిరాజ్ ఔట్ చేయడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో రక రకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

వైభ‌వ్ ప‌గ‌ల కొట్టేయ్ అంటూ ఆశిష్ నెహ్రా హింట్

Advertisement

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals vs Gujarat Titans, 52nd Match) మధ్య నిన్న మ్యాచ్ జరగగా..శుభ్ మ‌న్ గిల్ సేన అద్భుతంగా రాణించి విజయం సాధించింది. బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన గుజరాత్ టైటాన్స్… బౌలింగ్ లో కూడా ఇరగదీసింది. ఆశిష్ నెహ్రా (Ashish Nehra) సారథ్యంలోని గుజరాత్ బౌలింగ్ బృందం.. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లకు నరకం చూపించింది. ముఖ్యంగా వైభవ్ సూర్య వంశీని ఔట్ చేసేందుకు కీలక సూచనలు మహమ్మద్ సిరాజ్ కు ఆశిష్ నెహ్రా ఇచ్చారు. తల హైట్ లో బౌన్సర్ వేస్తే, కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ క్యాచ్ ఔట్ అవుతాడని గిల్ తో పాటు మహమ్మద్ సిరాజ్ కు హింట్ ఇచ్చాడు. ఇక ఆశిష్ నెహ్రా చెప్పినట్లుగానే అద్భుతంగా మహమ్మద్ సిరాజ్ బంతులు సంధించాడు.

దీంతో టెంప్ట్ అయిన వైభవ్ సూర్యవంశీ…త‌ల హైట్ కు వ‌చ్చిన షార్ట్ బాల్ ను కొట్టాడు. ఈ క్ర‌మంలో అర్షద్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చే ఔట్ అయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే దీన్ని కొంత మంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. వైభవ్ సూర్య వంశీ తల పగలగొట్టు… అప్పుడే మనం విజయం సాధిస్తామని మహమ్మద్ సిరాజ్ కు ఆశిష్ నెహ్రా సూచనలు ఇచ్చినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ కింద పడ్డాడని అంటున్నారు. దీని అంతటికి కారణం ఆశిష్ నెహ్రా అంటూ అతన్ని విలన్ చేస్తున్నారు. అయితే వాస్తవం మాత్రం అది కాదు. వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసేందుకు తల హైట్ వరకు షార్ట్ బాల్ వేయాలని ఆశిష్ నెహ్ర సూచించాడు తప్ప.. వైభ‌వ్ సూర్యవంశీ తల పగలగొట్టమని ఎక్కడా సూచ‌న‌లు ఇవ్వ‌లేద‌ని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. కావాలనే వైభవ్ సూర్య వంశీ పైన సింపతి పెరగాలని ఇలా కొంతమంది ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.

Advertisement

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

 

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×