E-Paper
Advertisement

Ashish Nehra: 2 కాదు 10 మ్యాచ్ ల్లో చెత్త‌గా ఆడినా గిల్ ను ఆడించాల్సిందే, టీ20ల‌కు అత‌నే క‌రెక్ట్‌

Ashish Nehra: 2 కాదు 10 మ్యాచ్ ల్లో చెత్త‌గా ఆడినా గిల్ ను ఆడించాల్సిందే, టీ20ల‌కు అత‌నే క‌రెక్ట్‌
Advertisement

Ashish Nehra:   టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa,T20I )మధ్య టి20 సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టి20 లకు శుభ్‌మ‌న్ గిల్ సరిగ్గా సెట్ కావడం లేదని, టెస్టులు అలాగే వన్డేలు మాత్రమే ఆడుకోవాలంటే చాలా మంది కామెంట్లు కూడా పెడుతున్నారు. మాజీ క్రికెటర్లు కూడా బహిరంగంగానే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కు అండగా నిలిచారు మాజీ క్రికెటర్, గుజ‌రాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌ ఆశిష్ నెహ్ర. కేవలం రెండు టి20 మ్యాచ్ ల‌లో విఫలమైన శుభ్‌మ‌న్ గిల్ ను తొలగించడం చాలా తప్పు అంటూ ఫైర్ అయ్యారు ఆశిష్ నెహ్ర. రెండు మ్యాచ్ ల‌తో శుభ్‌మ‌న్ గిల్ కెరీర్ డిసైడ్ చేయకూడదని కోరారు. దీంతో ఆశిష్ నెహ్రా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

రెండు టి20ల‌కే శుభ్‌మ‌న్ గిల్ ను జడ్జి చేయడం కరెక్ట్ కాదు

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టి20 సిరీస్ నేపథ్యంలో శుభ్‌మ‌న్ గిల్ వరుసగా రెండు మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయాడు. మొదటి మ్యాచ్ లో నాలుగు పరుగులు చేసి ఔట్ అయిన శుభ్‌మ‌న్ గిల్, రెండవ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. అలాగే గడిచిన 14 మ్యాచుల్లో ఒక్క అర్ధ సెంచ‌రీ కూడా చేయలేదు శుభ్‌మ‌న్ గిల్. ఈ 2025 సంవ‌త్స‌రం మొత్తం అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచాడు. దీంతో టి20 సిరీస్ నుంచి శుభ్‌మ‌న్ గిల్ ను తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. శుభ్‌మ‌న్ గిల్ స్థానంలో య‌శ‌స్వీ జైశ్వాల్ లేదా సంజు శాంస‌న్ కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు.

అయితే శుభ్‌మ‌న్ గిల్ ను జట్టు నుంచి తొలగించాలని చాలా మంది డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో ఆశిష్ నెహ్రూ ( Ashish Nehra ) మాత్రం అతనికి అండగా నిలిచాడు. టి20 లలో శుభ్‌మ‌న్ గిల్ ను తక్కువగా అంచనా వేయడం కరెక్ట్ కాదన్నారు. కేవలం రెండు మ్యాచ్ ల‌లో శుభ్‌మ‌న్ గిల్ విఫలమయ్యాడని గుర్తు చేశారు. ఇంకా అతనికి అవకాశం ఇవ్వాలని కోరారు. రెండు మ్యాచ్ ల‌లో విఫలమయ్యాడని పక్కకు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు మూడు నెలలు కాదు, మూడు వారాల ముందు, వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఇలాంటి ప్రదర్శన చేసినప్పటికీ అస్సలు కంగారు పడబోనని వ్యాఖ్యానించారు. టి20 క్రికెట్ అనేది చాలా డిఫరెంట్. ఏ క్షణమైన శుభ్‌మ‌న్ గిల్ ఫామ్ లోకి వస్తాడని వెల్లడించారు. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కోరారు. ఎప్పటిలాగే శుభ్‌మ‌న్ గిల్ ( Shubman Gill) అదరగొడతాడు అన్నారు.

Advertisement

 

Also Read: Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×