E-Paper
Advertisement

Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే
Advertisement

Ind vs SA 2nd T20I:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య న్యూ చండీగఢ్ వేదికగా రెండో టి20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ చెత్త బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఎన్నడూ లేని విధంగా అడ్డగోలుగా వైర్లు వేసి, గౌతమ్ గంభీర్ కు కోపం తెప్పించాడు అర్షదీప్ సింగ్. దక్షిణాఫ్రికా పై జరిగిన రెండో టి20 లో 11 ఓవర్ వేసి ఏకంగా 7 వైడ్లు వేశాడు. దీంతో ఆ ఓవర్ లో ఏకంగా 18 పరుగులు వచ్చాయి. ఈ సంఘటన నేపథ్యంలో పెవిలియన్ దగ్గర కూర్చున్న గౌతమ్ గంభీర్ చాలా సీరియస్ అయ్యారు. చెత్త బౌలింగ్ అంటూ విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

అర్ష్‌దీప్ బౌలింగ్ లో ఓవర్‌లో 7 వైడ్లు..గంభీర్ వార్నింగ్‌

Advertisement

టి20 లో అగ్రశ్రేణి బౌలర్ అయిన అర్ష‌దీప్‌ సింగ్ ఇవాల్టి మ్యాచ్ లో ఒకే ఓవర్ లో ఏడు వైడ్లు వేశాడు. అలాగే ఒక సిక్సర్ కూడా ఇచ్చి చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు అర్ష‌దీప్‌ సింగ్. దీంతో అర్ష‌దీప్‌ సింగ్ ను ఉద్దేశించి, పెవిలియన్ దగ్గర కూర్చున్న గౌతమ్ గంభీర్ చాలా సీరియస్ గా కనిపించాడు. అర్ష‌దీప్‌ సింగ్ నీది ఏం బౌలింగ్ అంటూ ఫైర్ అయ్యాడు. మొదటి నుంచి అర్ష‌దీప్‌ సింగ్ అంటే పడని గౌతమ్ గంభీర్, ఒక్క ఛాన్స్ రాగానే పెవిలియన్ నుంచి ఓ రేంజ్ లో సీరియస్ అయ్యాడు. దీనిపై అర్షదీప్ సింగ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బౌలర్లు మిస్టేక్ చేస్తూ ఉంటారు… పరుగులు ఇవ్వకూడదన్న టెక్నిక్ తో అర్ష‌దీప్‌ సింగ్ బౌలింగ్ వేశాడు. కానీ అవి వైడ్లు వెళ్లాయి. సిక్సర్లు, బౌండరీలు ఏమి ఇవ్వలేదు. కానీ ఏదో పెద్ద తప్పు చేసినట్లు అర్ష‌దీప్‌ సింగ్ పైన గౌతమ్ గంభీర్ అరవడం దారుణం అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అలాంటి యంగ్ కుర్రాలకు సపోర్ట్ గా నిలుస్తూ, ఎంకరేజ్ చేయాలి కానీ, ఇలా బహిరంగంగా తిట్టడం ఏంటని టీమిండియా ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. వెంటనే అర్ష‌దీప్‌ సింగ్ కు గౌతమ్ గంభీర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో 4 ఓవ‌ర్లు వేసిన అర్ష‌దీప్ సింగ్ 54 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

టీమిండియా టార్గెట్ ఎంతంటే ?

చండీగర్ లోని ముల్లన్‌పూర్ మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Maharaja Yadavindra Singh International Cricket Stadium, Mullanpur, New Chandigarh) వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్లు ఆడిన ద‌క్షిణాఫ్రికా 4 వికెట్లు న‌ష్ట‌పోయి ఏకంగా 213 ప‌రుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో సెంచ‌రీ మిస్ చేసుకున్న క్వింట‌న్ డికాక్ 90 ప‌రుగులు చేసి, సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. మిగిలిన ప్లేయ‌ర్లు రాణించ‌డంతో ద‌క్షిణాఫ్రికా భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్ లో 214 ప‌రుగులు సాధిస్తే, టీమిండియా విజ‌యం సాధిస్తుంది.

Advertisement

 

Also Read: Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×