RR VS GT Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) తుది దశకు వచ్చేసింది. ఇవాళ క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 2) మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. ఇందులో గెలిచినట్టు ఫైనల్ కు వెళ్ళనుంది. ఓడితే ఇంటిదారి పట్టాల్సిందే. ఇలాంటి క్రమంలో విజయం పై రెండు జట్లు దృష్టిపెట్టాయి. అయితే ఈ మ్యాచ్ లో కూడా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) చాలా కీలకము కానున్నాడు. అతన్ని అవుట్ చేస్తేనే గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తుంది. లేకపోతే హైదరాబాద్ జట్టుకు పట్టిన గతే పట్టడం గ్యారెంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఇవాళ జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసేందుకు ఆశిష్ నెహ్రా ( Ashish Nehra ) త్రిముఖ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బకు వైభవ్ డకౌట్ కావడం గ్యారంటీ అంటున్నారు గుజరాత్ టైటాన్స్ అభిమానులు. గుజరాత్ టైటాన్స్ కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ దళం ఉంది. మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ), హోల్డర్ ( Jason Holder), కగిసో రబాడా ( Kagiso Rabada) లాంటి ముగ్గురు డేంజర్ బౌలర్లు ఉన్నారు. వీళ్లు పవర్ ప్లే లో సగం వికెట్లు తీయగల యోధులు. ప్రతి బంతి 150 స్పీడ్ తో వేసే సత్తా ఉన్న బౌలర్లు. బౌన్సర్లు అవలీలగా సంధిస్తారు. యార్కర్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి అద్భుతమైన ముగ్గురు బౌలర్లను ఆశిష్ నెహ్రా చాలా బాగా డీల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీని అతి తొందరగా ఔట్ చేసేందుకు ఈ ముగ్గురితో స్పెషల్ సెషన్ ఏర్పాటు చేసుకున్నాడట.
వైభవ్ వీక్నెస్ పాయింట్లను గుర్తించి, బంతులు వేసేలా ఆశిష్ నెహ్రా త్రిముఖ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో వెంటనే వైభవ్ వికెట్ తీసేలా ప్లాన్ చేశాడట. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ ప్లాన్ వర్కౌట్ అయి… వైభవ్ త్వరగా నే అవుట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇవాళ గ్రౌండ్ లో ఏం జరుగుతుందో చూడాలి. అటు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇలా మూడు ప్రణాళికలు ఉన్నాయని విర్రవీగాడు. చివరికి అతని బౌలింగ్ లోనే వైభవ్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. మరి ఇవాళ గుజరాత్ టైటాన్స్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఈ మ్యాచ్ మొత్తం వైభవ్ సూర్య వంశీపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ ఆశిష్ నెహ్రా ప్లాన్ మిస్ ఫైర్ అయితే మాత్రం.. వైభవ్ ను తట్టుకోవడం మాత్రం గుజరాత్ వల్ల కాదు. మళ్లీ సెంచరీ చేసే ప్రమాదం కూడా ఉంటుంది.
🚨 ASHISH NEHRA MASTER STOKE & VAIBHAV SURYAVANSHI OUT 🚨
– Vaibhav Suryavanshi came back to bat in a very aggressive mood and smashed 34 runs off just 15 balls. He was not sparing any bowler from Gujarat Titans, hitting both Kagiso Rabada and Mohammed Siraj all around the… pic.twitter.com/jxS8wwowb2
— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 9, 2026