E-Paper
Advertisement

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే
Advertisement

Asia Cup 2027: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ముగిసిన నేపథ్యంలో టీమిండియా… అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ పైన దృష్టి సారించనుంది. ఆఫ్ఘనిస్తాన్ తో మరో నాలుగు రోజుల్లోనే టెస్టులతో పాటు వన్డేలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆసియా కప్ 2027 టోర్నమెంట్ (Asia Cup 2027) గురించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. 2025 చివరలో ఆసియా కప్ టీ20 ఫార్మాట్ లో జరగగా.. టీమిండియానే ఛాంపియన్ అయింది. ఇక ఇప్పుడు 2027 ఆసియా కప్ టోర్నమెంట్ పైన కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ టోర్నమెంట్ వన్డే ఫార్మాట్ లో జరగనుండగా… బంగ్లాదేశ్ ( Bangladesh ) వేదిక కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా వైరల్ అయింది.

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

టీమిండియాకు షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027

Advertisement

1984లో ప్రారంభమైన ఆసియా కప్ టోర్నమెంట్.. విజయవంతంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు 9సార్లు అత్యధికంగా టీమిండియానే టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత శ్రీలంక 6 టైటిల్స్ సంపాదించి రెండవ స్థానంలో ఉంది. ఇప్పుడు వరకు పాకిస్తాన్ 2 ఆసియా కప్ టోర్నమెంట్ లు గెలిచింది. ఈ మూడు జట్లు మినహా ఏ ఒక్క టీం కూడా ఇప్పటివరకు ఛాంపియన్ కాలేదు. ఇక ఆసియా కప్ టోర్నమెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఇందులో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ శాశ్వత సభ్య దేశాలు. యూఏఈ, ఒమన్, హాంగ్ కాంగ్ టీమ్స్ ఆడతాయి.

ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఇక 2025 ఆసియా కప్ టోర్నమెంట్ యూఏఈ వేదికగా జరిగింది. వాస్తవంగా పాకిస్తాన్ దేశంలోనే జరగాలి. కానీ ఇండియా పర్యటించబోదు కాబట్టి, తటస్థ వేదిక అయిన యూఏఈని సెలెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు 2027 ఆసియా కప్ బంగ్లాదేశ్ లో వన్డే ఫార్మాట్లో జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొన్న టి20 ప్రపంచ కప్ 2026 సందర్భంగా వివాదం రాజుకుంది. దీంతో ఈ టోర్నమెంట్ బహిష్కరించింది బంగ్లాదేశ్. అటు బంగ్లాదేశ్ లో కూడా పర్యటించబోకూడదని బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి క్రమంలో 2027 ఆసియా కప్ బంగ్లాదేశ్ లో జరిగితే పరిస్థితి ఏంటని చర్చ జరుగుతోంది. అయితే అప్పటివరకు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పెరిగే అవకాశాలు ఉంటాయని కొందరు చెబుతున్నారు.

పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ ఎప్పుడు అంటే

Advertisement

ఆసియా కప్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉంటే.. ప్లే ఆఫ్ దశలో తలపడే చాన్స్ ఉంటుంది. ఒకే గ్రూపులో ఉంటే… గ్రూప్ స్టేజిలో కచ్చితంగా తలపడతాయి. మొన్న ఆసియా కప్ 2025 సందర్భంగా కూడా ఇదే జరిగింది.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×