E-Paper
Advertisement

Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు !

Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు !
Advertisement

Inzamam-ul-Haq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament)  విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) నిలిచిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఛాంపియన్ అయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్ లో 75 పరుగులతో రాణించాడు. సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఈ క్రమంలో రెండోసారి వరుసగా బెంగళూరు టైటిల్ దక్కించుకుంది. అయితే రెండోసారి టైటిల్ గెల్చుకున్న బెంగళూరు జట్టు ఆట తీరుపైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ బౌలర్లు నెమ్మదిగా బౌలింగ్ చేశారని… అందుకే విరాట్ కోహ్లీ ( Virat Kohli ) క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఐపీఎల్ అంటే మొదటి నుంచి ఫిక్సింగ్ అని తాను చెబుతున్నట్లు గుర్తు చేశారు.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి నెమ్మ‌దిగా బంతులు వేశారు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ప్రారంభం నుంచి ఇంజమామ్ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ టోర్నమెంట్లో ఫిక్సింగ్ ( Match Fixing) జరుగుతోందని ఆరోపణలు కూడా చేశారు. ఇక ఆదివారం కోహ్లీ ఫైనల్స్ లో అద్భుతంగా ఆడిన నేపథ్యంలో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్ బౌలర్లతో విరాట్ కోహ్లీ అలాగే బెంగళూరు యాజమాన్యం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని బాంబు పేల్చారు. అందుకే విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు బంతులు నెమ్మదిగా వేశారని.. గుజరాత్ బౌలర్ల ( Gujarat titans Bowlers) పరువు తీశారు. బెంగళూరు జట్టులో అత్యంత భయంకరమైన బ్యాటర్లు ఉన్నారని.. వాళ్లందరూ విఫలమై కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే రాణించడం వెనుక పెద్ద కుట్ర కోణం ఉందని ఆరోపణలు చేశారు.

ఫిక్సింగ్ జరిగింది కాబట్టే విరాట్ కోహ్లీ ( Virat Kohli) 75 పరుగులు సాధించాడని.. చివరలో సిక్సర్ కొట్టి, క్రెడిట్ మొత్తం లాగేసుకున్నాడని బాంబు పేల్చారు. దీనిపై విచారణ చేస్తే అసలు విషయం బయట పడుతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇంజమామ్ ఉల్ హక్. అయితే ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి బెంగుళూరు ( RCB) జట్టును ఛాంపియన్ చేశాడని, ఇలా పాకిస్తాన్ వెధవలు మాట్లాడుతున్నారని సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ పైన కూడా విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి చాలా మ్యాచులు గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×