E-Paper
Advertisement

Asia Cup Rising Stars 2025: ఆసియా క‌ప్ లో ఫైన‌ల్స్ కు చేరిన పాకిస్తాన్‌..ఆదివార‌మే తుది ఫైట్, ఎవ‌రితో అంటే

Asia Cup Rising Stars 2025: ఆసియా క‌ప్ లో ఫైన‌ల్స్ కు చేరిన పాకిస్తాన్‌..ఆదివార‌మే తుది ఫైట్, ఎవ‌రితో అంటే
Advertisement

Asia Cup Rising Stars 2025: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ (ACC Mens Asia Cup Rising Stars 2025) తుది దశకు వచ్చేసింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు సెమీ ఫైనల్స్ శుక్రవారం రోజున పూర్తయ్యాయి. అయితే తొలి సెమీ ఫైనల్ లో టీమిండియా A ( Team India ) ఓడిపోగా బంగ్లాదేశ్ A ( Bangladesh) విజయం సాధించింది. ఇక ఈ రెండో సెమీఫైనల్ లో శ్రీలంక A ఇంటి దారి పట్టగా పాకిస్తాన్ A అద్భుత విజయంతో ఫైనల్ కు వెళ్ళింది. రెండో సెమీ ఫైనల్ లో శ్రీలంక A పై ఏకంగా ఐదు పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ విజయంతో ఫైనల్ కు వెళ్లిన పాకిస్తాన్ ( Pakisthan A), ఆదివారం అంటే నవంబర్ 23వ తేదీన బంగ్లాదేశ్ A తో ఫైనల్ ఆడ‌నుంది. ఇందులో గెలిచిన జట్టు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ ఛాంపియన్ గా నిలుస్తుంది.

Also Read: Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

ఆసియా క‌ప్ లో ఫైన‌ల్స్ కు చేరిన పాకిస్తాన్‌

Advertisement

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ A వర్సెస్ శ్రీలంక A ( Pakistan A vs Sri Lanka A, 2nd Semi-Final ) మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్స్ లో 9 వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ A 153 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని శ్రీలంక ఛేదించే క్రమంలో విఫలమైంది. ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన శ్రీలంక A 148 పరుగులకు కుప్ప కూలింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోయి ఇంటి దారిపట్టగా, పాకిస్తాన్ మాత్రం ఫైనల్ కు దూసుకువెళ్ళింది. ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి, ఫైనల్ దశలో అడుగుపెట్టింది. ఇక ఫైనల్స్ లో పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఫైనల్ ఎప్పుడంటే ?

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ ( Asia Cup Rising Stars 2025) ఫైనల్ మ్యాచ్ నవంబర్ 23వ తేదీ అంటే ఆదివారం రోజున జరగనుంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడతాయి. రాత్రి 8 గంటల సమయంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. దోహా లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక మొదటి సెమీఫైనల్ లో సూపర్ ఓవర్ దాకా మ్యాచ్ వెళ్ళింది. కాని చివరికి బంగ్లాదేశ్ విజయం సాధించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. అటు టీమిండియా మాత్రం ఇంటిదారి పట్టింది.

Advertisement

 

Also Read: 2025–26 Ashes series: ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే !

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×