E-Paper
Advertisement

Akhanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వంలో శివరాజ్ కుమార్ మరియు బాలకృష్ణ, సాధ్యమవుతుందా?

Akhanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వంలో శివరాజ్ కుమార్ మరియు బాలకృష్ణ, సాధ్యమవుతుందా?
Advertisement

Akhanda 2 : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ 2. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు విపరీతమైన సక్సెస్ సాధించాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ట్రైలర్ కూడా సినిమా మీద మీ ప్రియమైన అంచనాలను పెంచుతుంది.

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు. ఇప్పటికే ముంబై వేదికగా ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్ వేదికగా సెకండ్ సాంగ్ విడుదల చేశారు. ఆ పాటకు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

మల్టీస్టారర్ జరుగుతుందా?

Advertisement

ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ నేడు బెంగళూరులో చేశారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో శివరాజ్ కుమార్ మరియు బాలకృష్ణ హీరోలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలి అనే టాపిక్ వచ్చింది.

శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ నేను రెడీ అన్నారు, మరోవైపు బాలకృష్ణ మాట్లాడుతూ మేము రెడీ అన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను డబుల్ రడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి ఫంక్షన్స్ లో ఇలా మాట్లాడటం అనేది సహజంగానే జరుగుతుంది. కానీ నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా? ఇద్దరినీ ఆ రేంజ్ లో బోయపాటి డీల్ చేయగలుగుతాడా? అనేది చాలామందికి వస్తున్న సందేహం.

అఖండ 2 కాన్సెప్ట్ ఇదే 

Advertisement

కరోనా టైంలో అందరూ భయపడుతున్నప్పుడు మొదటిగా మా సినిమాను విడుదల చేశాము. ఆ సినిమా సక్సెస్ సాధించిన తర్వాత మిగతా సినిమాలన్నీ వచ్చాయి. అంటూ బాలకృష్ణ ఈ ఈవెంట్ లో మాట్లాడారు. పిల్లల జోలికి గానీ, ప్రకృతి జోలికి గానీ, ధర్మంజోలికి గానీ వస్తే , భగవంతుడు ఊరుకోడు అనే పాయింట్ అఖండ సినిమాతో చెప్పాము.

అఖండ 2 సినిమాతో సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నాం. నా సినిమాల్లో ఎప్పుడూ యువతను మంచిదారిలో పెట్టే సందేశం ఉంటుంది అంటూ బాలకృష్ణ స్పీచ్ ఇచ్చారు.

Also Read: Akhanda 2 : నేల టికెట్‌లో కూర్చున్న వాళ్లు… ఇంటర్వెల్‌కు వెళ్లి బాల్కనీలో కూర్చుంటారు

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×