Aus vs Eng 3rd Test: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ ( The Ashes, 2025-26 ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టులు పూర్తయ్యాయి. ఈ రెండు టెస్టుల్లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించి లీడ్ లో ఉంది. ఇలాంటి నేపథ్యంలో మొన్నటి నుంచి ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England, 3rd Test) మధ్య మూడవ టెస్ట్ ప్రారంభమైంది. అడిలైడ్ ( Adelaide Oval, Adelaide )
వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా విజయం వైపు దూసుకు వెళ్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఆస్ట్రేలియా డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ ( Mitchell Starc ) వేసిన ఓ అదిరిపోయే బంతికి, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
నిప్పు రవ్వ లా దూసుకు వచ్చిన ఆ బంతిని ఎదుర్కొనే క్రమంలో విఫలమయ్యాడు బెన్ స్టోక్స్. దీంతో 83 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ ఔట్ అయ్యాడు. ఇక మిచెల్ స్టార్క్ వేసిన ఆ బంతి చూసి, స్టోక్స్ ( Ben Stokes ) బిత్తర పోయాడు. అసలు ఎలా ఆ బంతి వచ్చింది, ఎలా నేను ఔట్ అయ్యాను ? అంటూ ఎగిరి గంతేశాడు. ఆ గందరగోళ పరిస్థితుల్లోనే పెవిలీయన్ బాట పట్టాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అటు అంతకుముందు ఇదే మిచెల్ స్టార్క్ వేసిన బంతి బెన్ స్టోక్స్ తలకు తగిలింది. అయితే ఆ సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు పెద్దగా ప్రమాదమేమీ జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Australia vs England, 3rd Test) మధ్య మూడవ టెస్ట్ లో బెన్ స్టోక్స్ టీం ఓటమి అంచున ఉంది. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 371 పరుగులకు ఆలౌట్ అయింది. అటు ఇంగ్లాండ్ 286 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ ఆడుతోన్న ఆస్ట్రేలియా, 3 వికెట్లు నష్టపోయి 1 39రుగులు చేసింది. ఓవరాల్ గా 224 పరుగుల లీడ్ సాధించింది ఆసీస్. మరో 200 పరుగులు సాధించి, డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది. ఇక కంగారుల దెబ్బకు రెండో ఇన్నింగ్స్ లో కూడా ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే, 3వ టెస్ట్ కూడా కంగారులే గెలుస్తారు.
Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!
OH MY WORD WHAT A SEED FROM MITCH STARC!#Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/1z4idDsklT
— cricket.com.au (@cricketcomau) December 19, 2025