Youtube Pixel 10 Discount| 2025 గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ విడుదల చేసింది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ చాలా ఖరీదు. ఈ కారణంగా చాలా మంది మిడ్ రేంజ బడ్జెట్ యూజర్లు పిక్సెల్ ఫోన్స్ కొనుగోలు చేయాలంటే వారికి సాధ్యం కాదు. అయితే గూగుల్ మిడ్ రేంజ్ యూజర్లందరికీ అందుబాటులోకి పిక్సెల్ ఫోన్స్ తీసుకురావాలని ఒక విన్నూత్న ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కారణంగా కొత్త పిక్సెల్ 10 సిరీస్ ఫోన్ల ధరపై 40 శాతం తగ్గింపు లభిస్తుంది. కానీ ఈ ఆఫర్ లో ఫోన్ కొనాలంటే గూగుల్ ఒక కండిషన్ పెట్టింది. ఇదేదో కష్టమైన కండీషన్ చాలా సులభం.
యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు గూగుల్ భారీ బెనిఫిట్ ప్రకటించింది. ఎలిజిబుల్ యూజర్లు పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇది ఈ ఏడాది అతి పెద్ద పిక్సెల్ ఆఫర్‌లలో ఒకటి. ఈ డీల్ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
గూగుల్ ఈ ఆఫర్‌ను అధికారిక ఈమెయిల్ ద్వారా షేర్ చేస్తోంది. ఈమెయిల్‌లో ప్రతి యూజర్‌కు యూనిక్ డిస్కౌంట్ కోడ్ ఉంటుంది. చెక్‌అవుట్ సమయంలో ఈ కోడ్ యాప్లై చేయాలి. కోడ్ లేకుండా డిస్కౌంట్ రాదు.
ఈ ఆఫర్ పెయిడ్ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే. ఫ్రీ యూట్యూబ్ యూజర్లకు ఈ డీల్ లభించదు. అమెరికాలోని చాలా మంది యూజర్లకు ఈమెయిల్ వచ్చింది. ఇతర దేశాలకు కూడా త్వరలోనే గూగుల్ ఈ ఆఫర్ ను విస్తరించనుంది.
40 శాతం డిస్కౌంట్ పూర్తి పిక్సెల్ 10 సిరీస్‌కు వర్తిస్తుంది. పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL వంటివి ఉన్నాయి. ఏ స్టోరేజ్ లేదా కలర్ వేరియంట్ అయినా ఎంచుకోవచ్చు. ట్రేడ్-ఇన్ బెనిఫిట్స్ ముందు ఈ డిస్కౌంట్ అప్లై అవుతుంది.
ఈ ఆఫర్‌తో పిక్సెల్ 10 ధరలు చాలా తగ్గుతాయి. పిక్సెల్ 10 సుమారు 359 డాలర్లు (భారత కెరెన్సీలో దాదాపు రూ.32,500)కు వస్తుంది. పిక్సెల్ 10 ప్రో 449 డాలర్లు (దాదాపు రూ.40,500). పిక్సెల్ 10 ప్రో XL సుమారు 719 డాలర్లు (దాదాపు రూ.65,000). ఈ ధరలన్నీ 40 డిస్కౌంట్ తరువాత లెక్కించినవి.
గూగుల్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లను కూడా జత చేయవచ్చు. ట్రేడ్-ఇన్ వాల్యూ డివైస్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. రెండింటినీ కలిపితే ధర మరింత తగ్గుతుంది. కొందరు చాలా తక్కువ ధరకు ఫోన్ పొందవచ్చు.
ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే. డిస్కౌంట్ డిసెంబర్ 31 వరకు వాలిడ్. గూగుల్ ఈ డెడ్‌లైన్ తర్వాత ఎక్స్‌టెండ్ చేయకపోవచ్చు. మీకు ఈ మెయిల్ వస్తే త్వరగా పిక్సెల్ సిరీస్ ఫోన్స్ సొంతం చేసుకోండి.
ఇంతకుముందు గూగుల్ ప్లే పాయింట్స్ మెంబర్లకు పిక్సెల్ 10 ప్రోపై 200 డాలర్లు తగ్గింపు ఇచ్చింది. కానీ ఈ కొత్త డీల్ మరింత డైరెక్ట్ సేవింగ్స్ ఇస్తుంది.
యూట్యూబ్ ప్రీమియం యూజర్లు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ పే చేస్తున్నారు. ఈ ఆఫర్ అదనపు వాల్యూ యాడ్ చేస్తుంది. పిక్సెల్ ఫోన్‌లు మరింత అఫోర్డబుల్ అవుతాయి. హాలిడే సీజన్‌లో అప్‌గ్రేడ్‌లను ప్రోత్సహిస్తుంది.
ప్రస్తుతం ఈ డీల్ అమెరికా వరకే పరిమితం. ఇండియాలో గూగుల్ కన్ఫర్మ్ చేయలేదు. ఇండియన్ యూట్యూబ్ ప్రీమియం యూజర్లు అప్‌డేట్స్ కోసం వేచి ఉండాలి.