E-Paper
Advertisement

Aus vs Eng Ashes 2025-26: నిప్పులు చెరిగిన స్టార్క్, స్టోక్స్ మొదటి రోజే 19 వికెట్స్.. ఊపు పెంచుతున్న యాషెస్ సిరీస్

Aus vs Eng Ashes 2025-26: నిప్పులు చెరిగిన స్టార్క్, స్టోక్స్ మొదటి రోజే 19 వికెట్స్.. ఊపు పెంచుతున్న యాషెస్ సిరీస్
Advertisement

Aus vs Eng Ashes 2025-26: పెర్త్ వేదికగా జరుగుతున్న యాషెష్ 2025 తొలి టెస్ట్ లో మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. తన అసాధారణమైన బౌలింగ్ తో చెలరేగాడు స్టార్క్. సీనియర్ బౌలర్లు లేకపోయినప్పటికీ జట్టు బాధ్యత మొత్తాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ {WTC} చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్ గా రికార్డులలోకి ఎక్కాడు.

Also Read: Smriti Mandhana wedding: స్మృతి మందాన పెళ్లికి డేట్ ఫిక్స్‌.. ప్ర‌ధాని మోడీ సంచ‌ల‌న లేఖ

Advertisement

పెర్త్ వేదికగా ఇంగ్లాండ్ తో నేడు ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లోనే ఏడు వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత అందుకున్నాడు. స్టార్క్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు మొదటి రోజు రెండవ సెషన్ కె ఆల్ అవుట్ అయింది. స్టార్క్ వేసిన బంతుల ధాటికి ఇంగ్లాండ్ జట్టు రెండవ సెషన్ లో 172 పరుగులకే కుప్పకూలింది.

మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆలౌట్:

పెర్త్ వేదికగా జరుగుతున్న ఈ మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ప్రారంభం నుండి దూకుడు ప్రదర్శించాలనుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్లకు స్టార్క్ కళ్లెం వేశాడు. మొదటి ఓవర్ లోనే ఓపెనర్ జాక్ క్రాలీ {0} వికెట్ పడగొట్టిన స్టార్క్.. ఆ తర్వాత మరో ఓపెనర్ బెన్ డకేట్ ని కూడా పెవిలియన్ కి పంపాడు. డకెట్ {21} వేగంగా పరుగులు చేసినప్పటికీ.. ఎక్కువసేపు నిలవలేకపోయాడు. లంచ్ బ్రేక్ కి ముందు మూడు వికెట్లు పడగొట్టిన స్టార్క్.. ఆ తర్వాత రెండవ సెషన్ లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. జో రూట్ {0}, బెన్ స్టోక్స్ {6}, గస్ అట్కిన్సన్ {1}, మార్క్ వుడ్ {0} వికెట్లను పడగొట్టి స్టార్క్ ఇంగ్లాండ్ కి ఊపిరి పీల్చనీయకుండా చేశాడు. తన పదునైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మొత్తం స్టార్క్ 12.5 ఓవర్లలో నాలుగు మెయిడిన్స్, 58 పరుగులు ఇచ్చి ఎడు వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ముగ్గురు డకౌట్:

Advertisement

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో మొత్తం ముగ్గురు డక్ అవుట్ అయ్యారు. ఒల్లీ పోప్ {46}, హ్యరీ బ్రూక్ {52} మాత్రమే కాసేపు పోరాడి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ చివర్లో జేమీ స్మిత్ {33} కొంత పోరాడినప్పటికీ.. స్టార్క్ తిరిగి వచ్చి చివరి రెండు వికెట్లు పడగొట్టి ఆటని ముగించాడు. కీలకమైన సమయాలలో డాగెట్, గ్రీన్ ఇచ్చిన బ్రేక్ త్రులతో ఇంగ్లాండ్ పూర్తిగా కుప్పకూలింది.

Also Read: Venkatesh Iyer: ఐపీఎల్ లో Impact Player తొల‌గించాల్సిందే… మా కెరీర్లు సంక‌నాకిపోతున్నాయి !

అయితే ఈ ఏడు వికెట్లు పడగొట్టిన క్రమంలో మిచెల్ స్టార్క్ పలు రికార్డులను కూడా నమోదు చేశాడు. యాషెస్ సిరీస్ లో 100 వికెట్లు తీసుకున్న స్టార్క్.. ఈ ఘనత సాధించిన తొలి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా నిలిచాడు. ఈ చారిత్రక ప్రదర్శనతో ఆస్ట్రేలియా కి స్టార్క్ బలమైన ఆరంభాన్ని అందించగా.. ఇంగ్లాండ్ కి ఈ సిరీస్ ప్రారంభం అత్యంత నిరాశను మిగిల్చింది. ఇక ఈ తొలి టెస్ట్ లో తొలిరోజే మొత్తంగా 19 వికెట్లు పడడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 172 పరుగులకు ఆల్ అవుట్ కాగా.. ఆ తరువాత ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా కూడా తొలి రోజు ఆటో ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇంకా 49 పరుగుల వెనుకంజలో ఉంది. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఇద్దరూ ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేశారు.

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×