E-Paper
Advertisement

Palash Muchhal Proposes: కళ్లకు గంతలు క‌ట్టి, అర్ధ‌రాత్రి స్టేడియంలో స్మృతికి పలాశ్ ‘సర్‌ప్రైజ్ ప్రపోజల్’

Palash Muchhal Proposes: కళ్లకు గంతలు క‌ట్టి, అర్ధ‌రాత్రి స్టేడియంలో స్మృతికి పలాశ్ ‘సర్‌ప్రైజ్ ప్రపోజల్’
Advertisement
 Palash Muchhal Proposes: టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana ) పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన ప్రియుడు పలాష్ ముచ్చల్ తో ( Palash Muchhal ) మూడు ముళ్ళు వేయించుకోబోతున్నారు స్మృతి మందాన. వీళ్ళ పెళ్లికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 23వ తేదీన స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం చాలా గ్రాండ్ గా జరగనుంది. మహారాష్ట్రలోని సంగ్లీ ప్రాంతంలో స్మృతి మందాన వివాహం గ్రాండ్ గా జరగనుంది. ఈ మేర‌కు ఏర్పాట్లు అన్ని గ్రాండ్ గానే జ‌రుగుతున్నాయి. గురువారం రోజున హ‌ల్దీ ఫంక్ష‌న్ కూడా జ‌రిగింది.

స్మృతి మందానకు పలాష్ ముచ్చల్ ‘సర్‌ప్రైజ్ ప్రపోజల్’

ఈ నెల 23వ తేదీన స్మృతి మందానను పెళ్లి చేసుకోబోతున్న పలాష్ ముచ్చల్… తనకు కాబోయే భార్యకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. స్మృతి మందానకు స‌ర్ ప్రైజ్ ప్రపోజల్ చేసి షాక్ ఇచ్చాడు. ఏ ప్రియుడు చేయని పని చేశాడు పలాష్ ముచ్చల్. డివై పాటిల్ ( DY Patil Stadium) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే స్మృతి మందాన‌కు ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. స్మృతి మందాన కళ్ళకు గంతలు కట్టి డివై పాటిల్ స్టేడియంలోకి తీసుకువెళ్లాడు పలాష్ ముచ్చల్. ఆ తర్వాత మోకాళ్లపై కూర్చొని స్మృతి మందాన‌కు ప్రపోజ్ చేశాడు పలాష్ ముచ్చల్. ఈ త‌రుణంలోనే ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి పలాష్ ముచ్చల్ ను గట్టిగా హాగ్ చేసుకుంది స్మృతి మందాన‌. ఈ సందర్భంగా ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.

స్మృతి మందాన పెళ్లి.. ప్రధాని మోడీ సంచలనం లేఖ

ఈ నెల 23వ తేదీన స్మృతి మందాన అలాగే పలాష్ ముచ్చల్ వివాహం జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర లేఖ రాశారు. ఎంగేజ్మెంట్ ఇప్పటికే చేసుకున్న స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ కు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ ఇద్దరు కూడా వారి వారి రంగాల్లో అద్భుతంగా రాణించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. వీళ్ళ దాంపత్య జీవితం చాలా సంతోషకరంగా ఉండాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ. వారి జీవితంలో ప్రతి మెట్టు సంతోషంగా సాగాలని కోరారు. ఇక అటు పలాష్ ముచ్చల్ ( Palash Muchhal )తో ఎంగేజ్ మెంట్ జ‌రిగిన‌ట్లు ఓ వీడియో ద్వారా స్మృతి మందాన పేర్కొన్నారు. టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్లు అంద‌రూ రీల్ చేసి, ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

Advertisement

Also Read: 2025–26 Ashes series: ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే !

 

Advertisement

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×