E-Paper
Advertisement

Venkatesh Iyer: ఐపీఎల్ లో Impact Player తొల‌గించాల్సిందే… మా కెరీర్లు సంక‌నాకిపోతున్నాయి !

Venkatesh Iyer: ఐపీఎల్ లో Impact Player తొల‌గించాల్సిందే… మా కెరీర్లు సంక‌నాకిపోతున్నాయి !
Advertisement

Venkatesh Iyer: వెంకటేష్ అయ్యర్.. విధ్వంసకర బ్యాటింగ్ కి పెట్టింది పేరు. ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ తరఫున టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి దిగుతాడు. అలాగే మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు. అందుకే ఇతడిని కలకత్తా నైట్ రైడర్స్ గత సీజన్ లో భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2025 సీజన్ వేలంలో వెంకటేష్ అయ్యర్ రూ. 23.75 కోట్లు పలికాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన మూడవ ఆటగాడిగా నిలిచాడు వెంకటేష్ అయ్యర్.

Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్ కొడుకు పుట్టుకపై అనుమానాలు.. సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు ?

Advertisement

కానీ గత సీజన్ లో తన ధరకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. 2025 సీజన్ లో అతడు 11 మ్యాచ్ లలో.. ఏడు ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడి.. 142 పరుగులు చేశాడు. మిగిలిన రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇక వెంకటేష్ అయ్యర్ అంతర్జాతీయ గణాంకాల విషయానికి వస్తే.. అతడు తన చివరి వన్డే 2022 జనవరి 21న, చివరి టీ-20 2022 ఫిబ్రవరి 27న ఆడాడు.

 

అయ్యర్ ని వదిలేసిన కలకత్తా నైట్ రైడర్స్:

Advertisement

ఐపీఎల్ 2026 మినీ వేళానికి ముందు ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ని కలకత్తా నైట్ రైడర్స్ వదిలేసింది. 2024 ఐపీఎల్ లో కేకేఆర్ ఛాంపియన్ గా నిలవడంలో వెంకటేష్ అయ్యర్ పాత్ర అపారమైంది. ఈ క్రమంలో 2025 లో అతడిని అధిక మొత్తానికి కొనుగోలు చేసింది కేకేఆర్. కానీ 2025 ఐపీఎల్ లో వెంకటేష్ అయ్యర్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. గత సీజన్ లో అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 2026 మినీ వేలానికి ముందు అతడిని KKR విడుదల చేసింది. అయ్యర్ తో పాటు ఆండ్రీ రస్సెల్, క్వింటెన్ డికాక్, అన్రిచ్ నార్ట్జే, మోయిన్ అలీ, స్పెన్సర్ జాన్సన్, రెహమానుల్లా గుర్బాజ్ లను సైతం వదులుకుంది. దీంతో కేకేఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తనను కలకత్తా నైట్ రైడర్స్ వదిలివేయడం పై తాజాగా వెంకటేష్ అయ్యర్ స్పందించాడు.

 

ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనని తొలగించాల్సిందే:

తనను కలకత్తా నైట్ రైడర్స్ వదిలివేయడంపై వెంకటేష్ అయ్యర్ స్పందిస్తూ.. ” ఈ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. నిజం చెప్పాలంటే ఇంకా ఆ జట్టుతో టచ్ లో ఉన్నాను. కేకేఆర్ కోచ్ అభిషేక్ నాయర్ తో మాట్లాడుతున్నాను. వేలం కోసం ఎదురుచూస్తున్నాను. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. వేలంలో కేకేఆర్ నన్ను కొనుగోలు చేయకపోతే.. అప్పుడు లీగ్ లోని ఇతర జట్లలో ఏ తరపున అయినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో మాత్రమే కాకుండా అవసరమైతే కెప్టెన్ కు సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. మాలాంటి ఆటగాళ్లకు ఐపీఎల్ ఓ అద్భుతమైన అవకాశం. నేను ఏ జట్టు తరుపున ఆడుతున్నాననేది ముఖ్యం కాదు.

Also Read: Temba Bavuma: CSKలోకి మ‌ర‌గుజ్జు.. ధోని అదిరిపోయే ప్లాన్ ?

నేను నా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాను. ఇక నా హృదయాన్ని అడగాల్సి వస్తే మాత్రం.. నేను ఇప్పటికీ కేకేఆర్ తరపున ఆడాలని భావిస్తున్నాను. కేకేఆర్ తో కలిసి ఒక ఛాంపియన్షిప్ గెలిచాను. అందువల్ల నా వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. వారు కూడా నాపై చాలా నమ్మకం ఉంచారు. అయితే ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనని తొలగించాల్సిందే. ఎందుకంటే మా కెరీర్లు నాశనం అవుతున్నాయి. ఈ రూల్ వల్ల కేవలం బ్యాటింగ్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాకు బౌలింగ్ వచ్చినా కూడా వేయలేకపోతున్నాను. కేవలం బ్యాటింగ్ చేసి ప్యాకప్ కావాల్సి వస్తుంది. నాలాగే నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే లాంటి ఆటగాళ్లు కూడా తమ కెరీర్లను నాశనం చేసుకుంటున్నారు. వీరిద్దరూ కూడా తమ తమ జట్ల నుండి ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతున్నారు. ఈ నిబంధన మాలాంటి ప్లేయర్లకు శాపంగా మారింది. ఈ నిబంధనను తొలగించాల్సిందే” అని డిమాండ్ చేశాడు వెంకటేష్.

 

 

View this post on Instagram

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×