E-Paper
Advertisement

Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్
Advertisement

Aus vs Eng Ashes 2025-26 : ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మ‌ధ్య ప్ర‌స్తుతం యాషెస్ సిరీస్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆధిక్యం క‌న‌బ‌రిచింది. కానీ తాజాగా తొలి టెస్ట్ మ్యాచ్ అనూహ్య మ‌లుపులు తిరిగింది. తొలి మూడు ఇన్నింగ్స్ లో ఇరు జ‌ట్లు క‌నీసం 200 చొప్పున స్కోర్ కూడా సాధించలేక‌పోయినా పెర్త్ పిచ్ పై ఆస్ట్రేలియా కీల‌క ఆట‌గాడు ట్రావిస్ హెడ్ సునాయ‌సంగా సెంచ‌రీ చేశాడు. టెస్ట్ మ్యాచ్ ని టీ-20 త‌ర‌హాలో ఆడుతూ బౌల‌ర్ల పై విరుచుకుప‌డ్డాడు. దీంతో 205 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా జ‌ట్టు విజ‌యం సాధించింది. చివ‌రి ఉంటాడ‌నుకున్న ట్రావిస్ హెడ్ 26.5వ ఓవ‌ర్ లో బ్రైడ‌న్ కార్సె బౌలింగ్ లో హెడ్ కొట్టిన బంతిని పోప్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో క్రీజులోకి స్టీవెన్ స్మిత్ ఎంట్రీ ఇచ్చాడు. 13 ప‌రుగులు చేయాల్సిన స‌మ‌యంలో ట్రావిస్ హెడ్ ఔట్ అయ్యాడు. ఆ త‌రువాత స్టీవెన్ స్మిత్, ల‌బుశాగ్నె ఫినిష్ చేశారు. లాబుశాగ్నె కూడా హాప్ సెంచ‌రీ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా జ‌ట్టు 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

Also Read : T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

ఇంగ్లండ్ ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

Advertisement

ముఖ్యంగా యాషెస్ సిరీస్ ను 2025-26 ను ఆస్ట్రేలియా జ‌ట్టు ఘ‌నంగా ప్రారంభించింది. తొలి టెస్ట్ లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఆసీస్ చిత్తు చిత్తు చేసింది. 205 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కంగారులు కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించారు. ఆసిస్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ కీల‌క మ్యాచ్ లో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడ‌టంతో విజ‌యం సులువు అయింది. ముఖ్యంగా ల‌క్ష్య ఛేద‌న‌లో ఇంగ్లండ్ జ‌ట్టు బౌల‌ర్ల‌ను హెడ్ ఉతికి ఆరేశాడ‌నే చెప్ప‌వ‌చ్చు. టీ-20 త‌ర‌హాలో బ్యాటింగ్ చేశాడు హెడ్. కేవ‌లం 69 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఓవ‌రాల్ గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 16 ఫోర్లు, 4 సిక్స్ ల‌తో 123 ప‌రుగులు చేశాడు. అత‌నితో పాటు మార్న‌స్ ల‌బుషేన్ (51) నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో బ్రైడ‌న్ కార్స్ ఒక్క‌డే రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో అద‌ర‌గొట్టిన జోఫ్రా ఆర్చ‌ర్, బెన్ స్టోక్స్ రెండో ఇన్నింగ్స్ లో తేలిపోయాడు.

స్టార్క్ బౌలింగ్ అదుర్స్.. ఏకంగా 10 వికెట్లు..!

రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట‌ర్లు తీవ్ర నిరాశ ప‌రిచారు. ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ 7 వికెట్ల ధాటికి తొలి ఇన్నింగ్స్ లో కేవ‌లం 172 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది ఇంగ్లండ్. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే తీరును క‌న‌బ‌రిచింది. రెండో ఇన్నింగ్స్ ఇంగ్లండ్ జ‌ట్టు 164 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. కానీ ఆస్ట్రేలియా జ‌ట్టు కూడా తొలి ఇన్నింగ్స్ లో అయితే ఇంగ్లండ్ కంటే 40 ప‌రుగుల వెనుకంజ‌లో ఉండింది. 132 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. దీంతో ఈ సిరీస్ లో ఇంగ్లండ్ విజ‌యం సాధిస్తుంద‌ని అంతా భావించారు. కానీ ట్రావిస్ హెడ్ మ్యాచ్ స్వ‌రూపాన్ని మార్చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో విఫ‌లం చెందిన ఆసీస్ జ‌ట్టు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుత‌మైన క‌మ్ బ్యాక్ ఇవ్వ‌డంతో అద్భుత‌మైన విజ‌యాన్ని అందుకుంది. రెండు ఇన్నింగ్స్ లు క‌లిపి 10 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ కి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రెండో టెస్ట్ డిసెంబ‌ర్ 04 నుంచి గ‌బ్బా వేదిక‌గా ప్రారంభం కానుంది.

Advertisement

Also Read : Aus vs Eng Ashes 2025-26: పేకమేడల్లా కూలిన ఇంగ్లాండ్ వికెట్లు..క‌న్నీళ్లు బ్రాడ్‌..ఆసీస్ టార్గెట్ ఎంతంటే

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×