Aus vs Eng Ashes 2025-26: ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs England, 1st Test) మధ్య యాషెస్ సిరీస్ ( The Ashes, 2025-26 ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్ననే ప్రారంభమైన ఈ యాషెస్ సిరీస్ పెర్త్ టెస్ట్ తుది దశకు వచ్చేసింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో 172 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు కుప్పకూలింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్ బోలాండ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, స్టార్క్, డగ్గెట్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ 164 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ తరుణంలో ఆస్ట్రేలియా ముందు 205 పరుగుల టార్గెట్ పెట్టింది ఇంగ్లాండ్. ఇక ఈ టార్గెట్ ఛేదించేందుకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగి, చాలా జాగ్రత్తగా ఆడుతోంది. ఇప్పటికే 43 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు. మరో 162 పరుగులు సాధిస్తే తొలి టెస్ట్ లో విజయం సాధిస్తుంది కంగారు జట్టు.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న పెర్త్ టెస్ట్ మ్యాచ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో డేంజర్ ఆటగాడు జో రూట్ డకౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో కేవలం ఎనిమిది పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మ్యాచ్ కీలకంగా మారిన సమయంలో బ్యాటింగ్ కు దిగిన జో రూట్ ఆదుకుంటాడు అనుకుంటే.. మరోసారి విఫలమయ్యాడు. ఈ రెండో ఇన్నింగ్స్ లో మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బోల్డ్ అయ్యాడు జో రూట్. అయితే ఈ వికెట్ పడిపోగానే కామెంట్రీ బాక్స్ లో ఉన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హెడెన్ సంబరాలు చేసుకున్నారు. అటు మరో కామెంటేటర్ గా ఉన్న ఇంగ్లాండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad Emtional) కాస్త ఎమోషనల్ అయ్యారు. రూట్ వికెట్ పడగానే తల పట్టుకున్నారు. ఇంగ్లాండ్ ఇక ఓడిపోయింది అన్న ఫీలింగ్ లోకి వెళ్లిపోయారు స్టువర్ట్ బ్రాడ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వికెట్లు పేక మేడల్లా కుప్పకూలుతున్నాయి. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 172 పరుగులకు ఆల్ అవుట్ కాగా, ఆస్ట్రేలియా 132 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇవాళ రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తోంది. వికెట్లు ఏమి నష్టపోకుండా గెలుపు దిశగా దూసుకు వెళ్తోంది. అంటే ఓవరాల్ గా రెండు రోజుల్లోనే 30 వికెట్లు పడ్డాయి అన్నమాట.
It’s honestly embarrassing when people try to compare Joe Root with legends like Sachin Tendulkar, Virat Kohli or Steven Smith. Those players dominated every condition.
Joe Root on the other hand still doesn’t have a single Test century on Austrlia soilpic.twitter.com/nfF3aYJNQY
— GillTheWill (@GillTheWill77) November 22, 2025
Stuart Broad reaction says all 😭
Joe Root goes for 8 🙂↔️
— Prakash (@definitelynot05) November 22, 2025