Watch Video : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక గల్లీ క్రికెట్ లో రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. ఈ మధ్య కాలంలో మనం చాలా వార్తలు విన్నాం. కొన్ని వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. బౌలర్ తిప్పి తిప్పి.. రివర్స్ బంతి వేస్తే.. బౌల్డ్ కావడం.. రివర్స్ లో బ్యాటింగ్ చేసి ఫోర్, సిక్స్ బాదడం.. ఇలా రకరకాల వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి మంచి క్రేజ్ లభిస్తోంది. ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ కి బాగా క్రేజ్ ఉంది. ఇండియాలో ఆడినట్టు ఏ దేశంలో కూడా గల్లీ క్రికెట్ ఆడరు. ప్రతీ రాష్ట్రంలో పంట పొలాల వద్ద.. గల్లీల వద్ద, చిన్న చిన్న మైదానాల్లో, స్కూళ్లలో, కాలేజీలలో ఇలా రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. కొందరూ పండుగ వేళలో చిన్న చిన్న గ్రామాల వారు టోర్నమెంట్స్ పెట్టి కూడా క్రికెట్ ఆడుతుంటారు. ఆ క్రికెట్ లో రకరకాల బంతులను వినియోగిస్తారు.
Also Read : Temba Bavuma : టెంబ బవుమా కోసం హాట్ బ్యూటీ… ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ మరీ
క్యాప్ విధ్వంసం..
తాజాగా సూరత్ లో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్ లో విచిత్రం జరిగింది. టెన్నిస్ బంతితో జరిగిన టోర్నమెంట్ లో బౌలర్ బంతిని విసిరేశాడు. అయితే బ్యాట్స్ మెన్ క్యాప్ పెట్టుకొని బంతిని బాదాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసే ముందు వికెట్లకి అతి చేరువలో బ్యాట్ ని పెట్టి అద్భుతమైన షాట్ ఆడాడు. అంత వరకు బాగానే ఉంది. కానీ బంతిని బౌండరీ దాటించిన తరువాత.. తన బ్యాట్ తో తన తలపై ఉన్న క్యాప్ కి తాకించాడు. క్యాప్ వచ్చి అతని వెనుకాల ఉన్న వికెట్ల పై పడింది. దీంతో బెల్స్ కింద పడ్డాయి. ఇక వెంటనే అంఫైర్ ఔట్ గా ప్రకటించాడు. ఇలా కూడా ఔట్ అయితారా..? అని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేయడం విశేషం.
విచిత్రం.. వికెట్లు..
ఇక ఇదిలా ఉంటే.. ఇటీవలే పంజాబ్ లో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్ లో ఓ యువకుడు వినూత్న బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఏ చేతితో బౌలింగ్ చేస్తున్నాడో అసలు బ్యాటర్లకు అర్థం కాలేదు. ఈ తికమక బౌలింగ్ బంతిని అంచనా వేయలేక బ్యాటర్లు పెవిలియన్ కి చేరారు. దీంతో ఆ యువ బౌలర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఎడమ చేతితో బాల్ అందుకున్నటువంటి ఆ బౌలర్.. చేతులను మార్చి వెనక్కి, ముందుకు తిప్పుతూ.. ఓ చేతి నుంచి మరో చేతికి బాల్ మార్చుతూ చివరికీ కుడి చేతితో బౌలింగ్ చేశాడు. ఇదంతా గమనించిన బ్యాటర్ కి ఏం అర్థం కాకపోవడం.. క్లీన్ బౌల్డ్ కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. తాజాగా సూరత్ లో జరిగిన టెన్నిస్ బంతి.. క్యాప్ కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
?igsh=MXZwazdnanp2MnRiZA==