Phanindra Narsetti: 8 వసంతాలు ఈ సినిమా రిలీజ్ ముందు వరకు కూడా దర్శకుడు పెద్దగా బయట కనిపించేవాడు కాదు. చాలామంది ఈయనను ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఒకప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ గా మంచి పేరు సాధించని పిఎన్ఆర్ కూడా ఈయన ఇంటర్వ్యూల కోసం చాలాసార్లు ప్రయత్నించాడు. అయితే ఇంటర్వ్యూ ఇవ్వడానికి సరైన టైం ఇది కాదు అంటూ ప్రతిసారి దాటుకు వచ్చారు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి.
తాను దర్శకత్వం వహించిన ఎనిమిదవసంతాలు సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో మణిరత్నం సినిమాని ఈరోజు కామెంట్ చేస్తున్నారు వీళ్లకు ఏం అర్హత ఉంది అనే మాటతో ఒక్కసారిగా ట్రోల్ కి గురి అయిపోయాడు. తనని అర్హత స్టార్ అంటున్నారు అంటూ తన సినిమా ఈవెంట్లోనే తెలిపాడు. అలానే తాను కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అంటూ తన సినిమాలోని వారణాసి సీన్ చూస్తే చాలు అంటూ తెలిపారు.
మండిపడుతున్న నెటిజెన్స్
వాస్తవానికి 8 వసంతాలు సినిమాకి సంబంధించి చాలా పెద్ద కథను రాసుకున్నాడు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి. ఈ సినిమాకి సంబంధించి మొదట 12 వసంతాలు అని కథను రాశాడు. అయితే అది చాలా పెద్ద కథ అయిపోతుంది అని ఎనిమిది వసంతాలకు కుదించాడు. ఇప్పుడు ఆ పనిని వసంతాలకు సంబంధించిన సినిమా స్క్రిప్టును ఆన్లైన్లో పెడతాను అంటూ ఫణీంద్ర నర్సెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక్కడతో మళ్లీ ఫణీంద్ర నర్సెట్టి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 8 వసంతాలే చూడలేకపోయాం మళ్లీ ఇప్పుడు 12 వసంతాలు ఎందుకు.? అవసరమైతే వెంకటేష్ నటించిన వసంతం సినిమా 12సార్లు చూస్తాం. దయచేసి మీరు మాత్రం మమ్మల్ని వదిలేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరోవైపు రిక్వెస్ట్ కూడా
అయితే అందరూ ఫణీంద్ర నర్సెట్టి ట్రోల్ చేయడం లేదు. కొంతమంది సపోర్ట్ గా కూడా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆ స్క్రిప్ట్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఫణీంద్ర నర్సెట్టి వర్క్ చూసి తనను పొగుడుతూ ఇంటర్వ్యూ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని ఫణీంద్ర నర్సెట్టి ఆ స్క్రిప్ట్ ను ఆన్లైన్లో పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. సినిమాను మించి ఈ స్క్రిప్ట్ లో ఉండబోతుంది అని చాలా ఇంటర్వ్యూస్ లో తెలిపాడు మరి అది ఏ స్థాయిలో పాఠకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read: Junior trailer out : గాలి జనార్దన్ తనయుడి జూనియర్ ట్రైలర్ రిలీజ్, కథను గాలికి వదిలేసారా.?