E-Paper
Advertisement

Bajaj Chetak-RCB Women’s Team: RCB మహిళా క్రికెట‌ర్లకు బ‌జాబ్ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఏకంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్, ఫీచ‌ర్స్ ఇవే

Bajaj Chetak-RCB Women’s Team: RCB మహిళా క్రికెట‌ర్లకు బ‌జాబ్ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఏకంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు గిఫ్ట్, ఫీచ‌ర్స్ ఇవే
Advertisement

Bajaj Chetak-RCB Women’s Team: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026 Tournament) విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( RCB Women’s Team ) నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ మహిళల జట్టు రెండోసారి టైటిల్ గెలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుగా ఓడించి, టైటిల్ సొంతం చేసుకుంది. స్మృతి మందాన కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు ఈ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజెర్స్‌ బెంగళూరు మహిళల జట్టుకు సంబంధించిన ప్లేయర్లకు బజాజ్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఆ జట్టులో ఉన్న సభ్యులందరికీ బజాజ్ చేతక్ C 25 ( 2026 Bajaj Chetak C25)  పేరుతో కొత్తగా లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్లను గిఫ్ట్ గా ఇచ్చింది బజాజ్ కంపెనీ.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

RCB మహిళా క్రికెట‌ర్లకు బ‌జాబ్ బంప‌ర్ ఆఫ‌ర్‌

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మహిళల జట్టు 2026 టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫిబ్రవరి ఐదవ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 20 ఓవర్స్ ఆడింది. ఈ నేపథ్యంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 203 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు చేదించింది. ఈ మ్యాచ్ స్మృతి మందాన అద్భుతంగా ఆడి, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది. అయితే తాజాగా టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు ప్లేయర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చింది బజాజ్ కంపెనీ. కొత్తగా లాంచ్ అయిన 2026 బజాజ్ చేతక్ C25 ( 2026 Bajaj Chetak C25) మోడల్ బైక్స్ అందజేసింది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు ధర, ఫీచ‌ర్స్ ఇవే

రాయల్ చాలెంజెస్ బెంగళూరు మహిళల జట్టుకు ( RCB Women’s Team ) ఇచ్చిన 2026 Bajaj Chetak C25 బైక్స్ ధర 92,000 వరకు ఉంటుంది. ఇది ఎక్స్ షోరూం ధర ప్రకారం మాత్రమే. అంటే దాదాపు లక్ష వరకు ఈ బైక్ ధర ఉండే ఛాన్స్ ఉంది. ఈ బైక్ 2.2 కిలో వాట్స్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 113 కిలో మీటర్ల మైలేజ్ కూడా అందిస్తుంది. 90 కిలో మీటర్ల స్పీడ్ తో దూసుకు వెళ్తుంది. ఈ 2026 Bajaj Chetak C25 బైక్ ఫుల్ ఛార్జింగ్ కావడానికి నాలుగు గంటలు పడుతుంది.

Advertisement

 

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×