E-Paper
Advertisement

Aishwarya Rajesh: సెట్లో స్వయంగా దోసెలు వేసిన ఐశ్వర్య రాజేష్.. వీడియో వైరల్!

Aishwarya Rajesh: సెట్లో స్వయంగా దోసెలు వేసిన ఐశ్వర్య రాజేష్.. వీడియో వైరల్!
Advertisement

Aishwarya Rajesh: టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) పేరుకే తెలుగమ్మాయి అయినా ఎక్కువగా తమిళంలో సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఇక్కడ రాజేంద్రప్రసాద్ ‘రాంబంటు’ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఐశ్వర్య రాజేష్.. మళ్లీ అదే రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ పోషిస్తూ వచ్చిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో కీలకపాత్ర పోషించి.. తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ , టక్ జగదీష్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. అలాంటి ఐశ్వర్య రాజేష్ గత ఏడాది ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్(Venkatesh హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇందులో భాగ్యం పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

సెట్ లో దోసెలు వేసిన ఐశ్వర్య రాజేష్..

ఇకపోతే ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేష్.. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా రోజుకు ఒక ఫోటో షూట్ తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది.. అలాంటి ఈమె తాజాగా సెట్ నుండి ఒక వీడియోను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఐశ్వర్య రాజేష్ ఫ్రెండ్లీ నేచర్ కి ఫిదా అయిపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేష్ షూటింగ్ నుండి కాస్త విరామం దొరకడంతో ఉదయాన్నే సెట్ లో ఉండే వాళ్లందరికీ స్వయంగా దోసెలు వేసి మరీ వడ్డించింది. ప్రొడక్షన్ బాయ్స్ ను మొదలుకొని ప్రతి ఒక్కరికి కూడా స్వయంగా తానే దోసెలు వేసి వడ్డించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పైగా దోసె వేస్తూ కాలాయా లేదా అని అడుగుతూ ఇంకా ఎవరికి కావాలి అని అడుగుతూ అందరిని ఆకట్టుకుంది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

Advertisement

also read:Allu Cinemas: గ్లోబల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్.. ఘనంగా ఆ మూవీతో అల్లు సినిమాస్ ప్రారంభం!

మరో తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు..

సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఐశ్వర్య రాజేష్ మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. గంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 అనే వర్కింగ్ టైటిల్ తో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా తిరువీర్ (Tiruveer) హీరోగా ఈ చిత్రం రాబోతోంది. భరత్ దర్శన్ దర్శకుడిగా రానున్న ఈ చిత్రానికి మహేశ్వరరెడ్డి మూలి తన గంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భరత్ మంచి రాజు సంగీతం అందిస్తూ ఉండగా.. తెలుగు, తమిళ్ ,మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇంకా ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×