India vs Pakistan: T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026 Tournament) నేపథ్యంలో పాకిస్తాన్ తన ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. ఇండియాతో అసలు మ్యాచ్ ఆడబోమని.. బహిష్కరిస్తున్నట్లు డ్రామాలు ఆడిన పాకిస్తాన్, ముసుగు తొలగిపోయింది. ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ దిగివచ్చిందట. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan ) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే మొదట మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు బెదిరింపులకు దిగింది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ కు నిధులు ఆపేస్తామని ఐసీసీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బకు చల్లబడిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board)… ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైందట. ఈ మేరకు ఐసీసీకి కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగడం పై సందిగ్ధత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగాలి. అయితే ఇండియాతో జరిగే మ్యాచ్ బహిష్కరిస్తామని పదేపదే చెబుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు…. ఇప్పుడు రూట్ మార్చినట్లు సమాచారం అందుతోంది. కచ్చితంగా ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బహిష్కరణ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ బాస్ సౌరవ్ గంగూలీ ( SOURAV GANGULY ) స్పందించారు.
ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) అడుక్కు తినడం గ్యారంటీ అని చురకలు అంటించారు. అసలు బహిష్కరణ అనే అంశం ఇలాంటి వరల్డ్ కప్ టోర్నమెంట్లలో ఉండ బోధని వెల్లడించారు. బహిష్కరిస్తే పాయింట్స్ తగ్గిపోవడం గ్యారంటీ అన్నారు. ఐసీసీ టోర్నమెంటులో ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరిస్తుందని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కోరినట్లుగానే శ్రీలంకలో మ్యాచులు జరుగుతున్నాయి.. ఇలాంటి నేపథ్యంలో బహిష్కరణ అవసరమా అని నిలదీశారు. ఒకవేళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగకపోతే భారీ నష్టం వాటిల్ల ప్రమాదం పొంచి ఉందని సౌరవ్ గంగూలీ ( SOURAV GANGULY ) హెచ్చరించారు. ఇక పాకిస్తాన్, టీమిండియాతో మ్యాచ్ ఆడకపోతే మాత్రం పీసీబీ అడుక్కు తినడం గ్యారెంటీ అన్నారు.
🚨SOURAV GANGULY REACTS IND PAK BOYCOTT. 🚨
Ganguly said: Boycotting WC match makes no sense, especially when the games are being played in Sri Lanka.😳
He added that in a WC, every single point matters, and skipping a match could hurt a team badly.pic.twitter.com/Je05jDJ0mY
— Sam (@Cricsam01) February 8, 2026