E-Paper
Advertisement

Gold Price Fell: మకర సంక్రాంతి వేళ బంగారం ధరలు తగ్గుముఖం, ఇవాళ మార్కెట్ మాటేంటి?

Gold Price Fell: మకర సంక్రాంతి వేళ బంగారం ధరలు తగ్గుముఖం, ఇవాళ మార్కెట్ మాటేంటి?
Advertisement

Gold Price Fell: సంక్రాంతి పండుగ వేళ బంగారం ధరలు మెల్లగా దిగొస్తున్నాయి.  ఒకవిధంగా పుత్తడి కొనుగోలు చేసేవారికి తీపి కబురు.  ఇదే ఒరవడి కంటిన్యూ అవుతుందా? చెప్పలేమని అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఇరాన్‌పై అమెరికా మెతక వైఖరి అవలంభించడం వల్లే ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ఒక వెర్షన్. రాత్రి నుంచి అమెరికా-ఇరాన్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.  ఆదేశంపై దాడులు చేసేందుకు అమెరికా రెడీ అవుతోందని సంకేతాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లో బంగారం ధరలు పెరగవచ్చని మార్గెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సంక్రాంతి వేళ దిగొస్తున్న బంగారం ధరలు

Advertisement

బంగారం ధరల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంటున్నాయి. రికార్డు స్థాయి రేటుకు చేరిన పసిడి, క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఒకవిధంగా చెప్పాలంటే బంగారం కొనుగోలుదారుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రికార్డు స్థాయిలో మూడు సెషన్ల తర్వాత గురువారం ఆసియా ట్రేడింగ్‌లో బంగారం ధరలు పతనమయ్యాయి. ఇదే కంటిన్యూ అవుతుందా? అంటే చెప్పడం కష్టమేనని మార్కెట్ వర్గాల మాట. అందుకు కారణాలు లేకపోలేదు.

బంగారం మార్కెట్ ధరలు తగ్గాలన్నా, పెరగాలన్నా అమెరికా తీసుకున్న నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ధరల పెరుగుదలతో ఇరాన్‌ లో నిరసనలు తారాస్థాయికి చేరాయి. దాదాపు 2600 మంది మరణించినట్టు నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. తమపై దాడులు చేస్తే, అందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామంటూ కొద్దిగంటల ముందు ఇరాన్ టీవీలో ఓ ప్రకటన వచ్చింది. అమెరికా పశ్చిమాసియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

ఇవాళ మార్కెట్ మాటేంటి? 

గురువారం తగ్గుదల ఉన్నప్పటికీ డిసెంబర్ చివరలో అమెరికా వడ్డీ రేటు కోతలు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, కేంద్ర బ్యాంకు కొనుగోళ్ల అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు పైకి ఎగబాకాయి. అయితే మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లో ధరలు పతనం అయినట్టు చెబుతున్నారు. గతరాత్రి బంగారం ట్రేడింగ్‌లో చివరిగా 0.8 శాతం తగ్గి ఔన్సుకు $4,588.55 వద్ద స్థిరపడింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి $34,594.10 వద్ద నిలకడగా ఉంది. శుక్రవార మార్కెట్లు ఏ విధంగా ఉంటాయన్నది చెప్పలేమని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.

ఇటీవల రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌ను తొలగించే ఆలోచన తనకు లేదన్నారు. అమెరికా ద్రవ్య విధానం పెట్టుబడిదారుల ఆందోళనను తగ్గించిందన్నారు. బంగారం ధరల పెరుగుదల బాగా పెరగడంతో ఇన్వెష్టర్లు లాభాల స్వీకరణ దిగడంతో తిరోగమనానికి కారణమని అంటున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర  లక్షా 44 వేల వద్ద కొనసాగుతోంది. అది 24 క్యారెట్ల బంగారం మాత్రమే.

ALSO READ:  భోగి వేళ భగ్గుమన్న బంగారం ధరలు..  తులం ఎంతో తెలుసా?

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×