E-Paper
Advertisement

Ind vs NZ 2nd ODI: కోహ్లీకి ఘోర అవ‌మానం..గంట‌న్న‌ర‌కే నెంబ‌ర్ 1 ర్యాంక్ గ‌ల్లంతు, రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ విక్ట‌రీ

Ind vs NZ 2nd ODI: కోహ్లీకి ఘోర అవ‌మానం..గంట‌న్న‌ర‌కే నెంబ‌ర్ 1 ర్యాంక్ గ‌ల్లంతు, రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ విక్ట‌రీ
Advertisement

Ind vs NZ 2nd ODI:  న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs New Zealand, 2nd ODI ) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ ఇండియా గెలిచింది. అయితే రాజ్ కోట్ లో ఉన్న నిరంజన్ షా స్టేడియం ( Niranjan Shah Stadium, Khandheri, Rajkot ) వేదికగా ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండవ వన్డే జరిగింది. ఇందులో చివరి వరకు పోరాడిన టీమిండియా కు ఫలితం దక్కలేదు. దీంతో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా విధించిన 284 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 47.3 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు న‌ష్ట‌పోయి ఛేదించింది న్యూజిలాండ్. దీంతో టీమిండియాపై 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించి, మూడు వ‌న్లేల సిరీస్ ను 1-1 తేడాతో స‌మం చేసింది. ఇక మూడో వ‌న్డే ఇండోర్ లో జ‌రుగ‌నుంది.

Also Read: Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్‌…రిజ్వాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే ఆయుషి సోనికి

కోహ్లీకి ఘోర అవ‌మానం..గంట‌న్న‌ర‌కే నెంబ‌ర్ 1 ర్యాంక్ గ‌ల్లంతు

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండవ వన్డేలో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం ఎదురయింది. ఈ మ్యాచ్ లో ఏడు పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి దూసుకు వెళ్ళాడు. ఈ సంఘటన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగింది. అంతకుముందు రోహిత్ శర్మ నెంబర్ వన్ ర్యాంక్ లో ఉన్నాడు. అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నెంబర్ వన్ స్థానానికి వచ్చిన విరాట్ కోహ్లీ, గంటన్నర లోపే తన ర్యాంకు కోల్పోయాడు. దీనికి కారణం న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్. ఈ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ చేసిన డారిల్ మిచెల్, రెండో స్థానం నుంచి, మొదటి స్థానానికి దూసుకు వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీకి ఘోర అవమానం ఎదురయింది.

ఆదుకున్న కేఎల్ రాహుల్

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI ) మధ్య జరిగిన రెండవ వన్డేలో మనోళ్ళ పరువు కాపాడాడు కేఎల్ రాహుల్. మొదటి వన్డేలో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించిన కేఎల్ రాహుల్ ( KL Rahul), ఈ రెండవ వన్డేలో సెంచరీ తో ఇరగదీశాడు. అందరూ విఫలమైనప్పటికీ, జట్టు బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు రాహుల్. ఈ నేపథ్యంలోనే 92 బంతుల్లో 112 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు 11 బౌండరీలు ఉన్నాయి. దీంతో నిర్ణయిత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు సాధించింది ఇండియా. కేఎల్ రాహుల్ తో పాటు టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ 56 పరుగులతో రాణించాడు. మొదటి వన్డేలో కూడా అర్థ సెంచరీ చేశాడు గిల్ ( Shubman Gill). దీంతో గిల్ కం బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: Bangladesh Minister: కాళ్లు ప‌ట్టుకున్నా ఇండియాలో అడుగుపెట్ట‌బోం..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాం !

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×