Ban vs Aus: బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia tour of Bangladesh, 2026) మధ్య ఇవాళ వన్డే సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. అయితే ఇవాళ ఢాకా వేదికగా (Shere Bangla National Stadium, Dhaka) బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా (Bangladesh vs Australia) మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో డక్వర్త్-లూయిస్ (DLS method) పద్ధతి ప్రకారం విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకి వచ్చిన నేపథ్యంలో డక్వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో 21 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్ గెలిచింది బంగ్లాదేశ్. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా (Bangladesh vs Australia) మధ్య ఇవాళ తొలి వన్డే జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది. మొన్న పాకిస్తాన్ పైన గెలిచిన ఊపులో ఉన్న బంగ్లాదేశ్, 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 284 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆస్ట్రేలియా దారుణంగా విఫలమైంది. 42 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే సాధించింది. ఆ సమయంలో భారీ వర్షం పడింది. వర్షం తగ్గకపోవడంతో..డక్వర్త్-లూయిస్ (DLS method) పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ ను విజేతగా ప్రకటించారు. దీంతో 21 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాపై బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది బంగ్లాదేశ్. 2005లో ఆస్ట్రేలియాపై గెలిచిన తర్వాత… ఇప్పుడు మళ్లీ విక్టరీ అందుకుంది.
బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే సందర్భంగా జోష్ ఇంగ్లిస్ ( Josh Inglis), బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు నహిద్ రానా ( Nahid Rana ) మధ్య గొడవ జరిగింది. ఈ మ్యాచ్ లో 25 బంతుల్లో 19 పరుగులు చేసిన కెప్టెన్ జోష్ ఇంగ్లిస్…నహిద్ రానా బౌలింగ్ లో వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు నహిద్ రానా. దీంతో సీరియస్ అయిన జోష్ ఇంగ్లిస్… రానాను బ్యాట్ తో కొట్టే ప్రయత్నం చేశాడు. అతనిపైకి దూసుకు వెళ్లాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ మిగిలిన ఆటగాళ్లు ఆస్ట్రేలియా కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ సర్ది చెప్పి, అక్కడ నుంచి వెళ్లగొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
?igsh=NzF1amJrN2Fycmhu