E-Paper
Advertisement

కార్తీ సినిమా షూటింగ్ కు బ్రేక్.. డైరెక్టర్ తో గొడవ నిజమేనా..?

కార్తీ సినిమా షూటింగ్ కు బ్రేక్.. డైరెక్టర్ తో గొడవ నిజమేనా..?

Karthi Project: టాలీవుడ్ యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్, కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన క్రేజీ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక పెద్ద దుమారమే రేగుతోంది. మ్యాడ్ చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న కళ్యాణ్ శంకర్, ఆ తర్వాత వచ్చిన మ్యాడ్ స్క్వేర్ (మ్యాడ్ 2) చిత్రంతో కూడా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ కామెడీని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ రెండు సాలిడ్ సక్సెస్ లతో ఏకంగా తమిళ స్టార్ హీరో కార్తీని లైన్లో పెట్టడం, సితార నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో టేకాఫ్ చేయడం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ గా మారింది.

లక్కీ బ్యూటీ మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా, ఈమధ్యే ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని, రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించుకుంది. అయితే, అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ అనుకోని వివాదంలో చిక్కుకుందని, అసలు సినిమానే పూర్తిగా ఆగిపోయిందనే ప్రచారం ఫిలిం సర్కిల్స్ లో తెగ సర్క్యులేట్ అవుతుంది.

షూటింగ్ సగం పూర్తి కాకముందే ఊహించని బ్రేక్

సాధారణంగా కార్తీ సినిమా స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో చాలా పక్కాగా ఉంటారు. ఖైదీ, సుల్తాన్, సర్దార్, పొన్నియిన్ సెల్వన్ వంటి విలక్షణమైన చిత్రాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కార్తీ, యువ దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ శంకర్ చెప్పిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ లైన్ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్ షూటింగ్ సగం కూడా పూర్తి కాకముందే ఊహించని బ్రేక్ పడినట్లు సమాచారం.

also read :బట్టలు విప్పితేనే రొమాన్సా? ‘పెద్ది’ డైరెక్టర్‌కు జయా బచ్చన్, కరీనా కపూర్ గట్టి కౌంటర్!

వినిపిస్తున్న టాక్ ప్రకారం షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే కార్తీ ఇప్పటివరకు తీసిన రషెస్ (షూట్ చేసిన సీన్స్) చూడాలని కోరారట. ఎడిటింగ్ టేబుల్ మీద ఆ ఫుటేజ్ చూసిన తర్వాత హీరో కార్తీ ఫుల్ డిసప్పాయింట్ అయ్యాడని ఇండస్ట్రీ టాక్.

అవుట్ పుట్ నచ్చలేదన్న కార్తీ 

కథ పేపర్ మీద విన్నప్పుడు ఉన్న మ్యాజిక్, స్క్రీన్ మీద ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు పూర్తిగా మిస్ అయిందని కార్తీ భావించినట్లు తెలుస్తోంది. టేకింగ్ లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ, కొన్ని కీలకమైన మార్పులు చేయాలని, లేకపోతే ఈ అవుట్‌పుట్‌తో సినిమా ముందుకు వెళ్లడం వేస్ట్ అని డైరెక్టర్‌కు కార్తీ సున్నితంగానే చెప్పినట్లు వినిపిస్తుంది. అయితే, తన రైటింగ్ మరియు టేకింగ్ స్టైల్‌పై పూర్తి నమ్మకంతో ఉన్న కళ్యాణ్ శంకర్.. హీరో చెప్పిన మార్పులకు ఒప్పుకోలేదని సమాచారం.

also read :షాకింగ్ ట్విస్ట్.. జయం రవికి కోర్టులో చుక్కెదురు.. ఆర్తి వేసిన భరణం కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్!

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా మూలనపడిందని, త్వరలోనే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు అఫీషియల్ అనౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. కార్తీ మాత్రం ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయినట్లు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే లైన్లో ఉన్న తన ఇతర కమిట్‌మెంట్స్ మరియు క్రేజీ డైరెక్టర్లతో అనుకుంటున్న కొత్త ప్రాజెక్ట్‌ల వైపు కార్తీ అడుగులు వేస్తున్నారట. మరి వినిపిస్తున్నట్టుగా నిజంగానే ఈ క్రేజీ కాంబో అటకెక్కిందా..లేక ఈ వార్త కేవలం గాసిప్ గానే మిగిలిపోతుందా చూడాలి.

Related News

బట్టలు విప్పితేనే రొమాన్సా? ‘పెద్ది’ డైరెక్టర్‌కు జయా బచ్చన్, కరీనా కపూర్ గట్టి కౌంటర్!

జాన్వీ సీన్ల కటింగ్స్ తర్వాత ‘పెద్ది’లో మేజర్ చేంజెస్..ఆ సీన్లు యాడ్ చేస్తున్న మేకర్స్!

షాకింగ్ ట్విస్ట్.. జయం రవికి కోర్టులో చుక్కెదురు.. ఆర్తి వేసిన భరణం కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్!

సినిమాకు ఐకాన్ హ్యూమన్ ఎమోషన్.. AI యుగంలో నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ క్రేజీ కామెంట్స్

హోటల్ రూమ్ ఖాళీ చేస్తూ విరుష్క ఏం వదిలి వెళ్లారంటే? బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్!

సాక్షి శివానంద్‌కు ఏమైంది? సినిమాలు వదిలి ఎందుకు పారిపోయింది? ఆ నిర్మాతే కారణమా?

38 ఏళ్లకే గుండెపోటుతో పాపులర్ సింగర్ మృతి.. షాక్‌లో సోషల్ మీడియా!

×