E-Paper
Advertisement

ధోనీ నా మాట లెక్క‌చేయ‌లేదు..కోట్ల రూపాయాలు రాకుండా చేశాడు, BAS బ్యాట్ ఓన‌ర్ సంచ‌ల‌నం !

ధోనీ నా మాట లెక్క‌చేయ‌లేదు..కోట్ల రూపాయాలు రాకుండా చేశాడు, BAS బ్యాట్ ఓన‌ర్ సంచ‌ల‌నం !
Advertisement

BAS bat owner Somi Kohli :  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జార్ఖండ్ రాష్ట్రం నుంచి వచ్చిన ధోని… 2007లోనే టీమిండియా సారధ్య బాధ్యతలు తీసుకొని… ప్రభంజనమే సృష్టించాడు. టీమిండియాకు రెండు వరల్డ్ కప్ లు తీసుకురావడమే కాకుండా.. ఓ చాంపియన్షిప్ కూడా అందించాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని గురించి BAS బ్యాట్ యజమాని సోమి కోహ్లీ ( BAS bat owner Somi Kohli) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ప్రపంచ కప్ సమయంలో కోట్ల రూపాయల స్పాన్సర్షిప్ వదులుకొని.. BAS స్టిక్క‌ర్లు ఉన్న‌ తన కంపెనీ బ్యాట్లను మాత్రమే మహేంద్రసింగ్ ధోని వాడినట్లు గుర్తు చేశారు. ఇతర బ్యాట్ల కంపెనీలు కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్లు ఇచ్చిన కూడా రిజెక్ట్ చేసినట్లు సంచలన విషయాలను పంచుకున్నారు సోమి కోహ్లీ. అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకు.. ఇతర కంపెనీల బ్యాట్లను వాడాలని తాను ఎంత బతిలాడినా ధోని వినలేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. దీంతో సోమి కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

ధోనీ నా మాట లెక్క‌చేయ‌లేదు..కోట్ల రూపాయాలు రాకుండా చేశాడు

Advertisement

మహేంద్ర సింగ్ ధోని గురించి చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. పెద్ద సెల్ఫిష్ అని కూడా మాట్లాడుతుంటారు. అయితే అలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెబుతూ BAS బ్యాట్ల ఓనర్ సోమి కోహ్లీ షాకింగ్ నిజాలను ఉపంచుకున్నారు. 2019 ప్రపంచ కప్ కంటే ముందు తన కంపెనీకి సంబంధించిన BAS స్టిక్కర్ ఉన్న బ్యాక్టను మాత్రమే మహేంద్ర సింగ్ ధోని వాడాడని వెల్లడించారు. ఒక్క రూపాయి తీసుకోకుండా తన బ్యాట్లను ప్రమోట్ చేశాడని గుర్తు చేశారు. అయితే ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీకి కోట్లల్లో ఇతర బ్యాట్ల కంపెనీలు ఆఫర్ చేశాయని షాకింగ్ నిజాలను పంచుకున్నారు. కానీ ఆ డబ్బులను ధోని వదులుకొని.. కేవలం తన కంపెనీని ప్రమోట్ చేసినట్లు వివరించారు. తన కంపెనీ గురించి ఆలోచించకని.. ఎక్కువ డబ్బులు ఇచ్చే వాళ్ల కోసం పనిచేయాలంటూ ధోనికి చాలా సార్లు చెప్పానని… కానీ ఆయన త‌న మాట‌ వినలేదని వెల్లడించారు. అటు ధోనికి సంబంధించిన అకౌంటెంట్, సాక్షి ధోనికి కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు. ధోని ఒక్క‌సారి నిర్ణయం తీసుకున్నాడంటే ఎవ్వరి మాట వినడని ఆయన భార్య సాక్షి వెల్లడించినట్లు సంచలన విషయాలు బయటపెట్టారు.

BAS కంపెనీ పట్ల ధోనీకి ఎందుకు అంత ఆసక్తి ?

అంతర్జాతీయ క్రికెట్ లోకి రాకముందు మహేంద్రసింగ్ ధోని కి BAS కంపెనీ యజమాని సోమి కోహ్లీ చాలా సహాయం చేశారు. క్రికెట్ కిట్లు, బ్యాట్లు అందించారు. జార్ఖండ్ తరపున దేశవాళి క్రికెట్ ఆడుతున్న క్రమంలో… భారీ సహాయం చేసి ధోని కెరీర్ ముందుకు వెళ్లేలా పునాది వేశారు. అందుకే ధోని ఇప్పటికీ కూడా BAS, SST స్టిక్కర్లు ఉన్న బ్యాట్లను ఫ్రీగానే ఉపయోగించి… కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Advertisement

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

Related News

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Big Stories

Advertisement
×