E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కిడ్నాప్‌ చేసిన ఐశ్వర్య  

Brahmamudi Serial Today Episode June 6th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కిడ్నాప్‌ చేసిన ఐశ్వర్య  
Advertisement

Brahmamudi serial today Episode: ఐశ్వర్యతో కారులో వెళ్తున్న ఇందు టెన్షన్‌ పడుతూ ఐశ్వర్యను రాకేష్‌ ఎక్కడున్నాడని.. సిటీకి చాలా దూరం వచ్చేశామని అడుగుతుంది. దీంతో తనకు ఏమీ తెలియదని రాకేష్‌ ఫోన్ చేస్తానన్నాడు అంటూ ఐశ్వర్య చెప్పగానే.. ఆఫీసులో బోర్డు మీటింగ్‌కు టైం అవుతుంది త్వరగా వెళ్లు అని చెప్పగానే.. అలాగే అంటూ మనసులో మాత్రం నువ్వు టెన్షన్‌ పడుతుంటే నాకు చాలా బాగుంది. అయినా నిన్ను బోర్డు మీటింగ్‌కు వెళ్లకుండా చేసేదుకే కదా నా ప్లాన్‌ అని మనసులో అనుకుంటుంది.

ఒక తాగుబోతు నారాయణ సైకిల్‌ మీద వెళ్తూ.. ఐశ్వర్య కారుకు సైడ్‌ ఇవ్వడు. దీంతో ఐశ్వర్య కారు ఆపేసి నారాయణు పిచ్చ తిట్టుడు తిడుతుంది. నారాయణతో గొడవ పడుతుంది. దీంతో నారాయణ కోపంగా నేనంటే ఏంటో చూపిస్తా.. అసలు సైడే ఇవ్వను.. నన్ను దాటి ఎలా వెళ్తారో చూస్తాను అంటూ సైకిల్‌ వేసుకుని ముందు వెళ్తుంటే.. ఐశ్వర్య కోపంగా చెప్తా నీ పని అంటూ నారాయణను కారుతో పక్కకు తోసేసి స్పీడుగా వెళ్లిపోతుంది. దీంతో నారాయణ కోపంగా నన్నే తోసేస్తావా..? ఈ నారాయణ పవరేంటో నీకు చూపిస్తా… నీ కారు ఎంత స్పీడుగా వెళ్తుందో నేను అంతే స్పీడుగా వచ్చి నీ సంగతేమటో చూస్తాను అంటూ వెళ్తాడు.

Advertisement

ఐశ్వర్య కొంత మంది రౌడీలు ఉన్న దగ్గరకు తీసుకెళ్లి కారు ఆపేస్తుంది. దీంతో ఇందు ఆశ్చర్యంగా చూస్తూ.. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడగ్గానే.. ఐశ్వర్య తాను ఇందును కిడ్నాప్‌ చేసినట్టు చెప్తుంది. దీంతో ఇందు రాజుకు ఫోన్‌ చేయబోతుంటే.. ఫోన్‌ లాక్కుంటుంది. నాకు కోపం తెప్పించొద్దు.. నోరు మూసుకుని సాయంత్రం వరకు ఇక్కడే ఉండు.. తర్వాత నేనే తీసుకెళ్తాను అంటూ రౌడీలకు చెప్పగానే.. రౌడీలు ఇందును ఇంట్లోకి తీసుకెళ్లి బంధిస్తారు.

మరోవైపు ఆఫీసుకు వెళ్లిన రాజు, రేఖతో వెటకారంగా మాట్లాడుతుంటాడు. ఇంతలో బోర్డు మీటింగ్‌ స్టార్ట్ అవ్వగానే.. రాజు తనను తాను పరిచయం చేసుకుంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే.. రేఖ రాజును ఇందు భర్త అంటూ పరిచయం చేస్తుంది. తర్వాత రేఖ వీళ్లందరూ బోర్డు మెంబర్స్‌ ఏం చేసుకుంటావో చేసుకో అంటూ వదిలేసి బయటకు వెళ్తుంది. తర్వాత పరంధామయ్య ఇందు గురించి అడిగి ఇందు ఇక్కడ ఉంటేనే తను అనుకున్నది జరుగుతుంది లేకపోతే జరగదు అని చెప్పగానే.. రాజు ఇప్పుడే ఫోన్‌ చేసి కనుక్కుంటాను అంటూ ఇందుకు కాల్ చేస్తాడు. ఐశ్వర్య వెంటనే ఫోన్‌ స్విచ్చాప్‌ చేస్తుంది. దీంతో రాజు కంగారు పడుతుంటాడు.  ఇంతలో తాను టెన్సన్‌ పడటం దేనికి ఇందు రాకపోతే నేనే కదా సీఈవోను అనుకుంటూ ఏవేవో కలలు కంటుంటాడు.

Advertisement

అప్పుడే  పరంధామయ్య బయటకు వచ్చి ఇందుకు ఫోన్‌ చేశావా..? అని అడగ్గానే.. చేశాను సార్‌ కానీ స్విచ్చాప్‌ వస్తుంది. అని చెప్పగానే.. పరంధామయ్య కోపంగా ఇందు రాకపోవడం ఏంటి..? ఫోన్‌ స్విచ్చాప్‌ చేయడం ఏంటి..? అంటూ ప్రశ్నిస్తుంటే.. రాజు వెంటనే ఇందు రాకపోతే తనను సీఈవోను చేయమని అడుగుతాడు. దీంతో పరంధామయ్య రాజుకు షాక్‌ ఇస్తాడు. రేఖకైనా సపోర్టు చేస్తాను కానీ నీకు చేయను అంటూ చెప్తాడు. ఇంతలో శృతి వచ్చి సార్‌ మేడం మీటింగ్‌ హాల్లోకి రమ్మంటున్నారు అంటూ చెప్పగానే.. పరంధామయ్య లోపలికి వెళ్తాడు. మరోవైపు ఐశ్వర్య కారును ఫాలో అవుతూ వెళ్లిన నారాయణ.. ఇందును కట్టేసిన. ఇంటి దగ్గరకు వెళ్లి కిటికీలోంచి ఐశ్వర్య, ఇందును కట్టేసి కోప్పడటం చూస్తుంటాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×