Basit Ali On IND VS WI: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ ల టి20 సిరీస్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐదు టి20 లో సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్ ఇప్పటికే ట్రోఫీ గెలుచుకుందని బాంబు పేల్చారు. సొంత గడ్డపై టీమిండియా పెద్దగా రాణించలేదని.. పసికూన వెస్టిండీస్ జట్టును ఎదుర్కోలేదని పరువు తీశారు. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వెస్టిండీస్ సిరీస్ గెలిచినట్టేనని తెలిపారు.
ఐదో మ్యాచ్ జరగకముందే… వెస్టిండీస్ కు ట్రోఫీ ఇచ్చేయండి అంటూ బాంబు పేల్చారు. గౌతమ్ గంభీర్ చేతకానితనం వల్ల టీమిండియా పరిస్థితి ఇలా తయారైందని ఫైర్ అయ్యారు. టీమిండియా నుంచి గౌతమ్ గంభీర్ ను బయటకు పంపించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ ఇలాగే కొనసాగితే సంకనాకి పోవడం గ్యారెంటీ అని హెచ్చరించారు. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ను తీసుకురావాలని బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ క్రికెట్ జట్టు అద్భుతంగా రాణిస్తోందని బాసిత్ ఆలీ వెల్లడించారు. వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ… టి20 సిరీస్ కచ్చితంగా గెలుస్తుందని అంచనా వేశారు. హైదరాబాద్ గడ్డపై విజయం సాధించిన వెస్టిండీస్… బెంగళూరులోనూ గెలిచి టీ20 సిరీస్ కైవసం చేసుకుంటుందని అంచనా వేశారు. టి20 టీం ఇండియా జట్టులో బౌలర్లు ఎవరు కూడా సరిగ్గా రాణించడం లేదని పరువు తీశారు. బూమ్ బూమ్ బుమ్రా ఒక్కడు లేకపోతే టీమిండియా బౌలర్లు దారాళంగా పరుగులు ఇస్తున్నారని హేళన చేశారు. ఇంత జరుగుతున్న గౌతమ్ గంభీర్ ఏం పీకుతున్నాడని నిలదీశారు.
మొన్నటి వరకు టీమిండియాను అద్భుతంగా గెలిచిన గౌతమ్ గంభీర్ కు ఏమైందని ప్రశ్నించారు. వెస్టిండీస్ చేతిలో ఓడిపోతుంటే.. చేతులు ముడుచుకొని కూర్చుంటున్నాడని ఆగ్రహించారు. ఒకవేళ ఐదవ టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఓడిపోయిన.. సాంకేతికంగా వాళ్లే విజయం సాధించినట్టు తాన అందరూ భావించాలన్నారు. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇప్పటి వరకు నాలుగు టి20 లు ఫినిష్ అయ్యాయి. ఇందులో చెరు రెండు మ్యాచ్లు గెలిచాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం రోజున చివరి టి20 జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.