E-Paper
Advertisement

Basit Ali : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేస్తే, మీరు అడుక్కు తింటారు

Basit Ali : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేస్తే, మీరు అడుక్కు తింటారు
Advertisement

Basit Ali : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ( ICC T20 World Cup 2026 ) నేప‌థ్యంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ఈ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొల‌గ‌గా, పాకిస్తాన్ కూడా త‌ప్పుకునే ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ కోసం ఇప్ప‌టికే పాకిస్తాన్ టీమ్ ను ప్ర‌కటించిన‌ప్ప‌టికీ, చివ‌రి క్ష‌ణంలో టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ త‌ప్పుకుంటుంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ బాసిత్ అలీ ( Basit Ali ) వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేస్తే, అంద‌రూ అడుక్కు తింటార‌ని బాంబ్ పేల్చారు. పాకిస్తాన్ ( Pakistan ) ఆడ‌క‌పోతే, టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ను చూసేవాడే ఉండ‌బోడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ దెబ్బ‌కు బ్రాడ్ కాస్ట‌ర్లు ( broadcasters) రోడ్డున ప‌డ‌తార‌న్నారు. పాకిస్తాన్ ఆడ‌క‌పోతే వాళ్లు రోడ్డున ప‌డ‌తార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: Jason Gillespie: ఫిక్సింగ్‌ అంటూ పాకిస్తాన్ మాజీ కోచ్ ఆరోప‌ణ‌లు..బ‌ట్ట‌లిప్పి కొడ‌తామంటూ ఇండియా వార్నింగ్‌

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను పాకిస్తాన్ బాయ్ కాట్ ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఆడకుండా బైక్ ఆర్ట్ చేస్తే.. బ్రాడ్ కాస్ట‌ర్లు అడుక్కు తినే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తాన్ దెబ్బకు వాళ్లు అప్పుల పాలు కూడా అవుతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాసిత్ అలీ. బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ వ్యవహరించిన తీరును ఆయన తప్పు బట్టారు. బీసీసీఐకి అనుకూలంగా ఐసీసీ వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు.

ఇండియాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఐసీసీ బంగ్లాదేశ్ పట్ల నిర్లక్ష్యంగా, అన్యాయంగా వ్యవహరించి పెద్ద తప్పిదం చేసిందని బాసిత్ అలీ ఫైర్ అయ్యారు. ఇలాంటి నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ తప్పకుండా బ్రాడ్ కాస్ట‌ర్లు అంద‌రూ రోడ్డున పడటం గ్యారెంటీ అన్నారు. పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ లో ఆడితేనే జనాలు చూస్తారని వివరించారు. అయితే దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. మీరు ఆడకపోయిన సరే టోర్నమెంట్ సజావుగా సాగుతుందని.. మీ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా ఆడుతుందని వెల్లడిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కంటే అత్యంత దారుణంగా పరిస్థితిలో పాకిస్తాన్ జట్టు ఉందని చురకలు అంటిస్తున్నారు.

పాకిస్తాన్ ప్రధానితో మొహ్సీన్‌ న‌ఖ్వీ సమావేశం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తో మొహ్సీన్‌ నఖ్వీ అత్యవసర సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాల్గొనడంపై చర్చ జరిగింది. అయితే సోమవారం లేదా ఈ శుక్రవారం పాకిస్తాన్ పాల్గొనటంపై నిర్ణయం తీసుకోబోతున్నారట.

Also Read: Yuzvendra Chahal Dating: ఛీ కొట్టిన ప్రియురాలిపై రివేంజ్‌..24 గంట‌ల్లోపే కొత్త అమ్మాయితో చాహ‌ల్ రొమాన్స్‌..మ‌గాడంటే వీడురా

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×