E-Paper
Advertisement

Jason Gillespie: ఫిక్సింగ్‌ అంటూ పాకిస్తాన్ మాజీ కోచ్ ఆరోప‌ణ‌లు..బ‌ట్ట‌లిప్పి కొడ‌తామంటూ ఇండియా వార్నింగ్‌

Jason Gillespie: ఫిక్సింగ్‌ అంటూ పాకిస్తాన్ మాజీ కోచ్ ఆరోప‌ణ‌లు..బ‌ట్ట‌లిప్పి కొడ‌తామంటూ ఇండియా వార్నింగ్‌
Advertisement

Jason Gillespie:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో బంగ్లాదేశ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ (Bangladesh) డిమాండ్లను ఐసీసీ ( ICC ) ఒప్పుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ కోచ్ జాసన్‌ గిలెస్పీ ( Jason Gillespie ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు ఒక న్యాయం.. బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశానికి మరో న్యాయం అంటూ ఐసీసీని నిలదీశారు. పెద్దన్నగా ఉండాల్సిన ఐసీసీ, బీసీసీఐ తో కుమ్మక్కు అయిందని నిప్పులు చెరిగారు. బీసీసీఐ ఆదేశాల మేరకే ఐసీసీ నడుస్తోందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టారు జాసన్‌ గిలెస్పీ. ఈ నేపథ్యంలో జాసన్‌ గిలెస్పీని ఇండియన్స్ దారుణంగా ట్రోలింగ్ చేశారు. పాకిస్తాన్ కుక్క అంటూ ఫైర్ అయ్యారు. నువ్వు దొరికితే బట్టలిప్పి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఐసీసీని విమర్శిస్తూ పెట్టిన పోస్ట్ వెంటనే డిలీట్ చేశాడు జాసన్‌ గిలెస్పీ.

Also Read: Smriti-Palash Muchhal: ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు..బెడ్ రూం నుంచి లాక్కొచ్చి మ‌రీ

జాసన్‌ గిలెస్పీ పై ఇండియన్ ఫాన్స్ సీరియస్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ దారుణంగా వ్యవహరించిందని పాకిస్తాన్ మాజీ కోచ్ జాసన్‌ గిలెస్పీ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఇండియా అలాగే ఐసీసీ మధ్య ఫిక్సింగ్ జరుగుతోందని.. బీసీసీఐ మాట మాత్రమే ఐసీసీ వింటోందని ఆరోపణలు చేశారు. చాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో పాకిస్తాన్ లో పర్యటించబోమని ఇండియా వెల్లడించింది.. ఆ సమయంలో బీసీసీఐకి అనుకూలంగా ఐసీసీ వ్యవహరించిందని గుర్తు చేశారు జాసన్‌ గిలెస్పీ. అందుకే దుబాయిలో ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ ల‌ను ఇండియా ఆడిందని వెల్లడించారు. అయితే ఇండియాకు ఈ ఆప్షన్ ఇచ్చిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, బంగ్లాదేశ్ కు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు.

దీంతో జాసన్‌ గిలెస్పీ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ ఫాన్స్ సీరియస్ అవుతున్నారు. నువ్వు దొరుకుతే బట్టలిప్పి మరి కొడతామని హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఊర కుక్క మొరుగుతోంది అంటూ జాసన్‌ గిలెస్పీ పై మండిపడుతున్నారు. ఆయన ఫ్యామిలీని ఉద్దేశించి బండ బూతులు తిడుతూ ఇండియన్ ఫాన్స్ పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశాడు జాసన్‌ గిలెస్పీ.

జాసన్‌ గిలెస్పీకి మద్దతు తెలిపిన షాహిద్ ఆఫ్రీది

Advertisement

ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగిందని పాకిస్తాన్ మాజీ కోచ్ జాసన్‌ గిలెస్పీ ( Jason Gillespie ) పోస్ట్ పెడితే… ఆయన పోస్టుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది మద్దతు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన జాసన్ గెలెస్పీ కూడా దీనిపై స్పందించాడని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులందరూ బంగ్లాదేశ్ కు మద్దతు తెలిపాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఐసీసీ అన్యాయంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలన్నారు ఆఫ్రీది.

Also Read:  Tanveer Ahmed: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ సిక్సులు కొడితే, పాకిస్తాన్ వీధుల్లో న‌గ్నంగా తిరుగుతా

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×