Gundeninda Gudigantalu : స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండెనిండా గుడి గంటల సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోరోజు ఒక్కో ట్విస్ట్ తో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సీరియల్ డిఫరెంట్ కాన్సెఫ్ట్ తో జనాలని అలరిస్తుంది. ఈ సీరియల్ లోని ప్రతి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా రోహిణి క్యారెక్టర్ హైలైట్ అవుతూ వస్తుంది. ఇటీవల కాలంలో ఈమె మలేషియా నుంచి రాలేదు అని అందరికీ తెలియడంతో ప్రభావతి తన కోడలు మోసగత్తె అని మనసులో ఫిక్స్ అయిపోతుంది.. అక్కడితో ఆగకుండా తన కొడుకుతో కలిసి అవకాశం లేదు అంటూ మనోజ్ ని రోహిణి విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రభావతి. రోహిణి క్యారెక్టర్ ఈమధ్య కనిపించదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రసాద్ పరిస్థితులను చూస్తే రోహిణి క్యారెక్టర్ అవుట్ అంటూ నెట్ ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే..
గుండు నిండా గుడి గంటలు సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ నటించే ప్రతి ఒక్కరు కూడా తమ క్యారెక్టర్ లో జీవించి నటిస్తున్నారు కాబట్టి సీరియల్కు మంచి క్రేజ్ అనేది లభించింది. ఈ మధ్యకాలంలో రోహిణి క్యారెక్టర్ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. రోహిణి ఇక సీరియల్ లో కనిపించదు అనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈమె క్యారెక్టర్ పై ఈ మధ్య స్కోప్ తగ్గడంతో ఆమెను లేపేస్తే బాగుంటుంది అని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సీరియల్ లో ఈమె క్యారెక్టర్ వెళ్ళిపోతే నెక్స్ట్ ఆ ప్లేస్ లోకి ఎవరు వస్తారు. లేదంటే మనోజ్ కి కొత్త అమ్మాయితో పెళ్లి అవుతుందా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా రోహిణి క్యారెక్టర్ లేకుంటే మాత్రం సీరియల్ లో ట్విస్ట్ ఏముంటుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది..
గుండెనిండా గుడిగంటలు సీరియల్లో రోహిణి క్యారక్టర్లో ఇప్పటికే ఇద్దరు యాక్టర్స్ కనిపించారు. అందులో ఒక ఆమె పేరు తులసి. గతంలో ఈమె అనేక సీరియస్లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ క్యారెక్టర్ లో నటిస్తున్న యాక్టర్ పేరు జ్యోతి గౌడ.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఈమె తెలుగులో నటించిన మొదటి సీరియల్ రాధమ్మ కూతురు సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయం అయింది. గోరింటాకు, అభిషేకం, వంటి సూపర్ హిట్ సీరియల్స్ వాళ్ళు నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె ఒక్కరోజు రెమ్యూనరేషన్విషయానికి వస్తే.. దాదాపు 25 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఈ లెక్కన ఈమె నెలకు దాదాపు లక్షల్లోని సంపాదిస్తూ వస్తుంది. మరి రోహిణి ఈ సీరియల్ నుంచి తప్పుకుంటే నెక్స్ట్ ఎవరు వస్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..