E-Paper
Advertisement

TGHC Recruitment: నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. జిల్లా కోర్టుల్లో కొలువుల జాతర, 859 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TGHC Recruitment: నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. జిల్లా కోర్టుల్లో కొలువుల జాతర, 859 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Advertisement

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు (TGHC) భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 859 పోస్టుల భర్తీ కోసం ఈ ప్రకటన వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026, జనవరి 24వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఖాళీల వివరాలు.. 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ విభాగంలో 319 ఖాళీలు ఉన్నాయి. మిగిలిన విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ (159), ప్రాసెస్ సర్వర్ (95), కాపిస్ట్ (63), ఫీల్డ్ అసిస్టెంట్ (61), ఎగ్జామినర్ (49), టైపిస్ట్ (42), రికార్డ్ అసిస్టెంట్ (36), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 (35) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ జిల్లాల వారీగా కేటాయిస్తారు.

విద్యార్హతలు, వయోపరిమితి

Advertisement

పోస్టుల స్వభావాన్ని బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. కొన్ని పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుండగా, మరికొన్నింటికి ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్హత ఉండాలి. వీటితో పాటు అభ్యర్థులకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. వయోపరిమితి విషయానికి వస్తే.. 18 ఏళ్ల నుండి 46 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

జీతం, దరఖాస్తు వివరాలు.. 

ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు లభించనున్నాయి. స్టెనోగ్రాఫర్ పోస్టుకు గరిష్టంగా రూ. 96,890 వరకు వేతనం ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు రూ. 19,000 నుండి ప్రారంభమై రూ. 58,850 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు రుసుము విషయానికొస్తే, జనరల్ మరియు బీసీ అభ్యర్థులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు (PWD), మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 400 గా నిర్ణయించారు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ.. 

Advertisement

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరగనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పోస్టుల అవసరాన్ని బట్టి నిర్వహించే స్కిల్ టెస్ట్ (టైపింగ్ లేదా స్టెనోగ్రఫీ) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన ప్రతిభే అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు గడువు తేదీ లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అఫీషియల్ వెబ్ సైట్: http://https//tshc.gov.in/

ALSO READ: AI Glasses: అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న AI కళ్లద్దాలు.. టెక్నాలజీ సృష్టించిన అద్భుతం ఇది!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×