E-Paper
Advertisement

BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా
Advertisement

BCCI vs PCB Salary Clash:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెటర్లు 50 లక్షలు చొప్పున ఫైన్ కట్టాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాకిస్తాన్ ప్లేయర్లు ఉలిక్కి పడుతున్నారు. తాము టీ20 ప్రపంచ కప్ ఆడితే వచ్చిన మొత్తం 29 లక్షల అయితే… 50 లక్షలు ఫైన్ ఎలా కడతామని పాకిస్తాన్ ప్లేయర్లు వాపోతున్నారు. అయితే ఈ వార్త వైరల్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్ల జీతాల గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.

Also Read: Kris Srikkanth: ఈ ఒక్క వెధ‌వ స్వార్థం వ‌ల్లే, వెస్టిండీస్ సంక నాకి పోయింది…మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

పాకిస్తాన్ క్రికెటర్ల జీతాల వివరాలు ఇవే

Advertisement

భారత క్రికెట్ నియంత్రణ మండలి కంటే చిన్నదైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. తమ స్థాయిలో క్రికెటర్లకు జీతాలు అందిస్తోంది. తమ ప్లేయర్లను మూడు కేటగిరీలుగా విభజించి జీతాలు అందిస్తోంది. కేటగిరి బి లో ఉన్న ప్లేయర్లకు ఏడాదికి 5.4 కోట్ల రూపాయలు అందిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అలాగే కేటగిరి C లో ఉన్న ప్లేయర్లకు మూడు కోట్ల రూపాయలు ఏడాదికి అందిస్తోంది.కేటగిరి D లో ఉన్న ప్లేయర్లకు 1.8 కోట్ల రూపాయలు అందిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇక ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడితే 3.61 లక్షలు అందిస్తున్నారు. అలాగే వన్డే మ్యాచ్ ఆడితే 1.86 లక్షల రూపాయలు అందిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. టి20 క్రికెట్ మ్యాచ్ ఆడితే చాలా తక్కువగానే చెల్లిస్తోంది. ఒక టి20 మ్యాచ్ ఆడితే 1.21 లక్షలు అందుకుంటున్నారు పాకిస్తాన్ ప్లేయర్లు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ ద్వారా ఇతర డబ్బులు కూడా పాకిస్తాన్ క్రికెటర్లకు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అందించే జీతాలతో పోలిస్తే టీమిండియా ( BCCI vs PCB Salary Clash) క్రికెటర్లకు ఎక్కువగానే డబ్బులు వస్తున్నాయి.

టీమిండియా ప్లేయర్ల జీతాలు

గ్రేడ్ A క్రికెటర్లకు ఐదు కోట్ల రూపాయలు అందిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి… గ్రేడ్ B ప్లేయర్లకు మూడు కోట్లు మాత్రమే ఇస్తున్నారు. గ్రేడ్ C ప్లేయర్లకు కోటి రూపాయలు అందిస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే ఒక్కో మ్యాచ్ కు బిసిసిఐ ఇచ్చే డబ్బులు మాత్రం భారీగా ఉన్నాయి. ఒక టెస్ట్ మ్యాచ్ టీమ్ ఇండియా ప్లేయర్ ఆడితే 15 లక్షలు సొంతం చేసుకుంటున్నాడు. వన్డే మ్యాచ్ ఆడితే ఆరు లక్షలు అందిస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇక టి20 కి మూడు లక్షలు ఇస్తున్నారు. టెస్టులు ఆడే ప్లేయర్లకు అడిషనల్ బోనస్ కింద 45 లక్షల రూపాయలు అందిస్తున్నారు. ఇందులో తక్కువ ప్రదర్శన కనబరిచిన ప్లేయర్లకు 30 లక్షలు ఇస్తున్నారు. ఐపీఎల్ ద్వారా భారీ మొత్తంలో టీమిండియాకు డ‌బ్బులు వ‌స్తున్నాయి.

Advertisement

Also Read: T20 World Cup Semi Final Schedule: మార్చి 4 నుంచే సెమీస్ రేస్‌..టీమిండియా షెడ్యూల్ ఇదే, వ‌ర్షం ప‌డితే ఎలా

 

https://www.facebook.com/share/p/1P7oFzdKdC/

 

Related News

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

Big Stories

Advertisement
×